మీటింగ్ మధ్యలో చైనాకు రాజ్‌నాథ్ సింగ్ వార్నింగ్

  • Published By: sreehari ,Published On : September 5, 2020 / 03:57 PM IST
మీటింగ్ మధ్యలో చైనాకు రాజ్‌నాథ్ సింగ్ వార్నింగ్

భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాస్క్‌లో చైనా రక్షణ మంత్రి వెయ్ ఫెంఝె సమావేశమయ్యారు.. మే నెల ప్రారంభంలో తూర్పు లడఖ్ లో సరిహద్దుల్లో ఉద్రిక్తత పెరిగిన తర్వాత ఇరు దేశాల మధ్య మొదటి ఉన్నత స్థాయి సమావేశం జరగడం ఇదే తొలిసారి..



ఈ సమావేశంలో లడఖ్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న ప్రతిష్టంభనతో పాటు రెండు అణు సాయుధ దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించే మార్గాలపై ఇరు పక్షాలు చర్చించాయి. షాంఘై సహకార సంస్థ (SCO) రక్షణ మంత్రుల సంయుక్త సమావేశంలో పాల్గొనేందుకు ఇరుదేశాల రక్షణ మంత్రులు హాజరయ్యేందుకు వచ్చారు.



మాస్కోలోని హోటల్ మెట్రోపోల్‌లో భారత కాలమానం ప్రకారం.. రాత్రి 9:30 గంటలకు సమావేశం ప్రారంభమైంది. రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్, రష్యాలోని భారత రాయబారి డిబి వెంకటేష్ వర్మ భారత ప్రతినిధి బృందంలో ఉన్నారు. సరిహద్దు వివాదంపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ గతంలో చైనా వాంగ్ యితో టెలిఫోన్ చర్చలు జరిపారు. చర్చలకు కొన్ని గంటల ముందు.. SOC మంత్రివర్గ సమావేశంలో రాజ్ నాథ్ సింగ్ మాట్లాడారు.. సరిహద్దుల్లో చైనా బలగాలను సాధ్యమైనంత తొందరగా ఉపసంహరించుకోవాలని సింగ్ గట్టిగానే కౌంటర్ ఇచ్చినట్టు సమాచారం..



సరిహద్దుల్లో చైనా దురుసు వైఖరిపై ఈ భేటీలో భారత్ తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేసినట్లు తెలిసింది.. ఘర్షణలకు ముందు ఉన్న స్థితిని వెంటనే పునరుద్ధరించాలని డ్రాగన్‌కు భారత్ తెగేసి చెప్పినట్టు తెలిసింది.. ఇరుదేశాల మధ్య శాంతి వాతావరణం నెలకొనేలా చర్చలకు ముందుకు రావాలని పిలుపునిచ్చింది. సెప్టెంబర్ 10న జరుగబోయే SCO సభ్య దేశాల విదేశాంగ మంత్రుల సమావేశానికి జైశంకర్ చైనా ప్రత్యర్థి వాంగ్ యిని కలిసే అవకాశం ఉంది.