Akasa Air : త్వరలో గాల్లోకి.. రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా ఎయిర్ లైన్స్‌కు కేంద్రం ఆమోదం

బిగ్​ బుల్​గా పేరొందిన దిగ్గజ స్టాక్​ మార్కెట్​ ఇన్వెస్టర్​ రాకేష్​ ఝున్​ఝన్​వాలా సైతం ఏవియేషన్ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ‘ఆకాశ' ’ పేరుతో ఎయిర్ లైన్స్ సంస్థను నెలకొల్ప

Akasa Air : త్వరలో గాల్లోకి.. రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా ఎయిర్ లైన్స్‌కు కేంద్రం ఆమోదం

Akasa Air : బిగ్​ బుల్​గా పేరొందిన దిగ్గజ స్టాక్​ మార్కెట్​ ఇన్వెస్టర్​ రాకేష్​ ఝున్​ఝన్​వాలా సైతం ఏవియేషన్ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ‘ఆకాశ’ ’ పేరుతో ఎయిర్ లైన్స్ సంస్థను నెలకొల్పారాయన. తాజాగా దీనికి సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆకాశ ఎయిర్ లైన్స్ ప్రభుత్వం నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్(NOC) పొందింది. ఈ మేరకు ఎస్ఎన్ వి ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రకటన చేసింది. ఆకాశ ఎయిర్ పేరుతో విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.

UPSC : బీటెక్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. దరఖాస్తుకు రేపే లాస్ట్

ఝన్‌ఝున్‌వాలాతో కలిసి జెట్‌ ఎయిర్‌వేస్‌ మాజీ సీఈవో వినయ్‌ దూబె ‘ఆకాశ ఎయిర్’ను ఏర్పాటు చేశారు. డీజీసీఏ నుంచి లైసెన్స్ పొందనున్నారు. లైసెన్స్ వచ్చాక 2022 వేసవి నుంచి ఆకాశ ఎయిర్ విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఆకాశ ఎయిర్ కి వినయ్ దూబె సీఈవోగా ఉండనున్నారు. ఇండిగో ఎయిర్ లైన్స్ మాజీ ప్రెసిడెంట్‌ ఆదిత్య ఘోష్‌ సైతం రాకేశ్ బృందంలో చేరనున్నారని తెలుస్తోంది. ఎన్ఓసీ అందుకున్న క్రమంలో వినయ్ దూబెకి కంగ్రాట్స్ చెప్పారు ఆదిత్య ఘోష్.

”కేంద్రం నుంచి ఎన్వోసీ అందుకున్న వినయ్ దూబె అండ్ టీమ్ కి అభినందనలు. భారతీయ ప్రయాణికులకు సమర్థవంతమైన, నమ్మకమైన మరియు సరసమైన ధరకే ప్రయాణ అనుభవాన్ని అందించే ప్రయాణం. దేశంలోని అత్యంత ఆధారపడదగిన విమానయాన సంస్థ” అని ఘోష్ ట్వీట్ చేశారు.

AICTE : విద్యార్థులకు శుభవార్త.. నెలకు రూ.12,400.. అర్హతలు, దరఖాస్తు విధానం..

అమెరికా ప్లేన్ తయారీదారు బోయింగ్ తో ఆకాశ ఎయిర్ చర్చలు జరుపుతోందని సమాచారం. B737 Max planes కావాలని అడిగినట్టు తెలుస్తోంది. ఏవియేషన్ మార్కెట్ లో ఎయిర్ బస్ A320 ఎయిర్ క్రాఫ్ట్ సిరీస్… బోయింగ్ B737 ప్లేన్ సిరీస్ తో పోటీ పడుతోంది. 2022 వేసవి నుంచి విమాన సర్వీసులు ప్రారంభించాలని ఆకాశ ఎయిర్ లక్ష్యంగా పెట్టుకుంది. రానున్న నాలుగేళ్లలో 70 ప్లేను ఆపరేట్ చేయాలని ప్రణాళిక రచించింది.

ఇటీవలే రాకేష్​ ఝున్​ఝన్​వాలాను ప్రధాని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా పీఎం మోదీ ట్వీట్​ చేస్తూ ‘‘సింప్లిసిటీకి మారుపేరైన, అత్యంత చురుకైన వ్యక్తిని ఇవాళ కలిశాను. భారత ఆర్థిక వ్యవస్థలో టాప్​ ప్లేస్​లో దూసుకుపోతున్న బిగ్​బుల్​ను కలవడం సంతోషంగా ఉంది” అని ఆనందం వ్యక్తం చేశారు. అంతేకాదు, వారి సమావేశానికి సంబంధించిన రెండు ఫోటోలను కూడా షేర్​ చేశారు. ఈ ఫోటోల్లో రాకేష్​ ఝున్​ఝున్​వాలా సతీమణి రేఖా సైతం కనిపించారు. భారత షేర్​ మార్కెట్​లో ఓ వెలుగు వెలుగుతున్న రాకేష్​ ఝున్​​ఝున్​వాలా నలిగిన చొక్కాతో చాలా సాదాసీదాగా కనిపించడం గమనార్హం.

ఇదిలా ఉంటే, స్టాక్​మార్కెట్​ దిగ్గజం, ప్రపంచ అపర కుబేరుడు వారెన్​ బఫెట్​తో ఝున్​ఝున్​వాలాను పోలుస్తారు చాలామంది ఆర్థిక నిపుణులు. ఆయన్ను ‘ది ఇండియన్ వారెన్ బఫెట్’ గా పిలుచుకుంటారు. తెలివిగా ఇన్వెస్ట్​ చేయడంలో దిట్టగ్గా పేరొందిన ఝున్​ఝున్​వాలా, అతని కుటుంబ ప్రస్తుత ఆస్తుల విలువ ఐఐఎఫ్ఎల్ వెల్త్ ఇండియా రిచ్ జాబితా ప్రకారం అక్షరాలా రూ.22వేల 300 కోట్లుగా ఉంది. కాగా, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి ద్వారా కేవలం ఒక్క నెలలోనే రూ.900 కోట్లు సంపాదించిన ఝున్​ఝున్​వాలా పేరు ఇటీవల దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. త్వరలోనే విమానయాన రంగంలోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించి సంచలనం రేపారు. తక్కువ ధరకే విమానయాన సేవలు అందించాలన్నది రాకేశ్ ఝున్ ఝున్ వాలా ఉద్దేశం.