Akasa Airlines: రాకేశ్ ఝున్‌జున్‌వాలా ‘ఆకాశ ఎయిర్’ మొదటి బ్యాచ్ విమానాలు సిద్ధం: జులైలోనే సేవలు
అమెరికాలోని పోర్ట్ ల్యాండ్ నగరంలో బోయింగ్ ఫ్యాక్టరీలో డెలివరీకి సిద్ధమైన ఆకాశ ఎయిర్ విమానాల ఫోటోలను సంస్థ సోమవారం మీడియాకు విడుదల చేసింది.

Akasa Airlines: ప్రముఖ పెట్టుబడిదారుడు, భారతీయ కుబేరుడు రాకేశ్ ఝున్‌జున్‌వాలా విమానయాన రంగంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ‘ఆకాశ ఎయిర్’ పేరుతో దేశీయంగా(Domestic Service) విమానాలు నడిపేలా ఆకాశ ఎయిర్ ను ప్రారంభించారు ఝున్‌జున్‌వాలా. కాగా ఆకాశ ఎయిర్ కి సంబంధించి మొదటి బ్యాచ్ విమానాలు సిద్ధం అయ్యాయి. అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ నుంచి 18 ‘బోయింగ్ 737 మ్యాక్స్’ ఎయిర్ క్రాఫ్ట్ లను ఆకాశ ఎయిర్ కొనుగోలు చేసింది. మొత్తం 72 ‘బోయింగ్ 737 మ్యాక్స్’ విమానాలను ఆకాశ ఎయిర్ ఆర్డర్ చేసింది. ఈమేరకు మొదటి విడతగా సిద్ధమైన నాలుగు విమానాలు జూన్ మధ్య నాటికి సంస్థకు అప్పగించనుంది బోయింగ్ సంస్థ. అనంతరం జులై నుంచి దేశీయంగా విమాన సేవలు ప్రారంభం అవుతాయని ఆకాశ సంస్థ తెలిపింది.
other stories:Antarctica ice : అంటార్కిటికాలో గ్లోబల్ వార్మింగ్‌ను తట్టుకొని పెరిగిన ఐస్ షెల్ఫ్‌లు
అమెరికాలోని పోర్ట్ ల్యాండ్ నగరంలో బోయింగ్ ఫ్యాక్టరీలో డెలివరీకి సిద్ధమైన ఆకాశ ఎయిర్ విమానాల ఫోటోలను సంస్థ సోమవారం మీడియాకు విడుదల చేసింది. ఆరంజ్, ఊదా రంగులలో చూడగానే ఆకట్టుకునేలా తీర్చిదిద్దిన విమానాలు ఎంతో ముచ్చటగా ఉన్నాయంటూ సంస్థ తెలిపింది. మొదటి విడతగా తయారు చేసిన 18 విమానాలు మార్చి 23 నాటికి ఆకాశ సంస్థకు అప్పగించనున్నది బోయింగ్ సంస్థ. జెట్ ఎయిర్ వేస్ తో కలిసి 2022 మధ్య నాటికి పూర్తి స్థాయిలో విమాన సేవలు భావించాలని చూస్తుంది ఆకాశ ఎయిర్.
Can’t keep calm! Say hi to our QP-pie! 😍#AvGeek pic.twitter.com/sT8YkxcDCV
— Akasa Air (@AkasaAir) May 23, 2022
వచ్చే ఏడాది మార్చి 23 నాటికి తమ 18 విమానాలతో దేశీయంగా టయర్ 2, టయర్ 3 నగరాల్లో సేవలు అందుబాటులోకి వస్తాయని సంస్థ వెల్లడించింది. అయితే జెట్ ఎయిర్ వేస్ ఇటీవలే జెట్ ఎయిర్వేస్ భారత హోం మంత్రిత్వ శాఖ నుండి సెక్యూరిటీ క్లియరెన్స్‌ను పొందగా..DGCA నుండి AOC లైసెన్స్ పొందింది. అయితే ఆకాశ ఎయిర్ మాత్రం ఇంకా ఈ క్లియరెన్స్ లకు అప్లై చేయాల్సి ఉంది. దేశీయ విమాన ప్రయాణాలకు పెరుగుతున్న గిరాకీ నేపథ్యంలో రానున్న 20 ఏళ్లలో భారత్ లో 1000 కొత్త విమానాలు అవసరం ఉంటుందని ఎయిర్ వేస్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
- Rakesh Jhunjhunwala : తక్కువ ధరకే విమాన టికెట్, ఆకాశ నుంచి బోయింగ్‌కు రూ.75,000 కోట్ల ఆర్డరు ?
- Rakesh JhunJhunwala: లక్కంటే అతనిదే.. లెక్క తప్పలేదు.. గంటలో రూ.101కోట్ల లాభం
- Akasa Air : త్వరలో గాల్లోకి.. రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ఎయిర్ లైన్స్‌కు కేంద్రం ఆమోదం
- India’s Big Bull : స్టాక్స్ అమ్మే విషయంలో ఝున్‌ఝున్‌వాలా ఏం చేస్తారు ?
- Rakesh Jhunjhunwala : హస్తిన పర్యటనలో బిగ్ బుల్..నిన్న మోదీ,నేడు నిర్మలమ్మతో భేటీ..అందరిలో ఆసక్తి
1Rasool Pookutty : RRR గే సినిమా అంటూ ఆస్కార్ అవార్డు విన్నర్ కామెంట్స్.. కౌంటర్ ఇచ్చిన బాహుబలి నిర్మాత..
2Honour Killing : అల్లుడి హత్యకు సుపారీ ఇచ్చిన మామ
3TRS Politics : మంత్రి సబితా ఇంద్రారెడ్డి భూ కబ్జాలను ప్రోత్సహిస్తున్నారు..చెరువులు,స్కూల్ స్థలాలను కూడా వదలటంలేదు..
4Eiffel Tower: ఈఫిల్ టవర్‌కు తుప్పు.. రిపైర్ చేయకుంటే తప్పదు ముప్పు
5BJP : 2014విజయం తర్వాత దూకుడుమీదున్న బీజేపీ..మిషన్ 2050ని అందుకుంటుందా..?
6BJP Mission South India : దక్షిణాది రాష్ట్రాల్లో అధికారం దక్కించుకునే సత్తా బీజేపీకి ఉందా? మోదీ, షా సదరన్ స్ట్రాటజీ ఏంటి ?
7Sukumar : ‘పుష్ప 2’లో విజయ్ సేతుపతి.. మరో విలన్‌గా కన్ఫర్మ్..
8Maharashtra : షిండే సర్కార్ కీలక నిర్ణయం..ఇంధనంపై వ్యాట్ తగ్గిస్తామని ప్రకటన
9Sony Liv : ఫేమస్ పైరసీ సైట్ తమిళ్ రాకర్స్ పై వెబ్ సిరీస్..
10Narendra Modi : ప్రధాని పర్యటనలో నల్ల బెలూన్లు-ఐదుగురు అరెస్ట్
-
Xiaomi 12S Series : షావోమీ నుంచి 3 ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్లు.. అద్భుతమైన కెమెరా ఫీచర్లు.. ధర ఎంత ఉండొచ్చుంటే?
-
Maruti Petrol Vehicles : మారుతి కీలక నిర్ణయం.. వచ్చే పదేళ్లలో పెట్రోల్ కార్లు ఆపేస్తాం!
-
OnePlus Y1S Pro : వన్‌ప్లస్ నుంచి 50 అంగుళాల కొత్త స్మార్ట్‌టీవీ.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?
-
Amazon Prime : రెండే రెండు క్లిక్స్.. మీ అమెజాన్ ప్రైమ్ అకౌంట్ క్యాన్సిల్ అయినట్టే..!
-
Apple Watch Series 8 : ఈ ఆపిల్ స్మార్ట్ వాచ్ ఉంటే.. మీకు జ్వరం ఉందో లేదో చెప్పేస్తుంది..!
-
WhatsApp : వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. పొరపాటున మెసేజ్ పంపారా? ఎప్పటిలోగా డిలీట్ చేయొచ్చుంటే?
-
Lalu Prasad Yadav : ఆస్పత్రిలో చేరిన లాలూ ప్రసాద్ యాదవ్.. ఏమైందంటే?
-
Baby Health : బేబి హెల్త్ గ్రోత్ కోసం!