Rakesh Jhunjhunwala : ఒక్కరోజులో రూ.20 కోట్లు సంపాదించాడు

వ్యాపారవేత్త రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా గంటల వ్యవధిలో రూ.20 కోట్లు ఆర్జించాడు. తన కంపెనీ ట్రేడ్ చేసిన షేర్ వ్యాల్యూ ఒక్కసారిగా పెరగడంతో రూ.20 కోట్లు ఖాతాలోకి వచ్చిపడ్డాయి.

Rakesh Jhunjhunwala : ఒక్కరోజులో రూ.20 కోట్లు సంపాదించాడు

Rakesh Jhunjhunwala

Rakesh Jhunjhunwala : రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా.. చాలామందికి సుపరిచితమే. షేర్ మార్కెట్ పై అవగాహన ఉన్నవారిలో చాలామంది ఝున్‌ఝున్‌వాలా గురించి తెలుసుకునే ఉంటారు. వివిధ కంపెనీల్లో 30 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారు ఝున్‌ఝున్‌వాలా. స్టాక్‌మార్కెట్‌ వ్యాపారంలోనే వేల కోట్లు సంపాదించారు. ఇక తాజాగా ఈయన ఖాతాలోకి మరో రూ.20 కోట్లు వచ్చిపడ్డాయి. అది కూడా 24 గంటల వ్యవధిలోనే కావడం విశేషం.

ఆ డబ్బు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం..

దేశంలో ప్రముఖ మీడియా హబ్ లలో జీ మీడియా గ్రూప్ ఒకటి. జీ గ్రూప్ ఎండీ పదవి నుంచి పునీత్‌ గోయెంకాను తొలగించాలంటూ పెట్టుబడిదారులు పట్టుబట్టారు. ఈ విషయం వార్తల్లోకి ఎక్కడంతో సెప్టెంబరు 14న మంగళవారం ఆ కంపెనీ షేర్లు భారీ పతనాన్ని చవి చూశాయి. ఇదే సమయంలో ఆ కంపెనీ షేర్లపై కన్నేశారు ఝున్‌ఝున్‌వాలా. ఆ కంపెనీ షేర్ల ధర పడిపోతూ రూ.220.44 దగ్గర ఉన్నప్పుడు రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలాకు చెందిన రారే కంపెనీ ఒకేసారి 50 లక్షల షేర్లను కొనుగోలు చేసింది.

Read More : Child marriage : బాల్య వివాహాలను చట్టబద్ధం చేసిన రాజస్థాన్..అసెంబ్లీలో సవరణ బిల్లు పాస్​

లోయర్ సర్క్యూట్ లో ట్రేడ్ అవుతున్న సమయంలో ఝున్‌ఝున్‌వాలా భారీగా షేర్లు కొన్నారని ప్రచారం జరగడంతో ఒక్కసారిగా షేర్ ధర పెరిగింది. మంగళవారం రూ.187కు వెళ్లిన షేర్ ధర.. బుధవారం ఒక్కసారిగా ఎగసిపడింది. ఒకానొక దశలో 287ను తాకింది. చివరికి రూ.261 దగ్గర స్టేబుల్ అయింది. ఈ భారీ పెరుగుదలతో ఒక్కరోజులోనే ఝున్‌ఝున్‌వాలాకి రూ.20కోట్ల లాభం వచ్చిపడింది.

Read More : Punjab : నాకొద్దు ఈ పదవి, సోనియాకు అమరీందర్ లేఖ!