Ban Raksha Bandhan for 300 years : 300 ఏళ్లుగా రాఖీ పండుగను బ్యాన్ చేసిన 60 గ్రామాల ప్రజలు..ఎందుకంటే
ఆగష్టు 11న రక్షా బంధన్ గా పిలుచుకునే ఈ పండుగను దేశమంతా జరుపుకోనున్నారు అన్నా చెలెల్లు, అక్కా తమ్ముళ్లు. ఈ సందర్భంగా అసలు రక్షా బంధన్ పండును బ్యాన్ చేసిన కొన్ని గ్రామాల గురించి తెలుసుకుందాం..

Ban Raksha Bandhan for 300 years : ఈ ఏడాది ఆగష్టు 11న రాఖీ పండుగ వచ్చింది. రక్షా బంధన్ గా పిలుచుకునే ఈ పండుగను దేశమంతా జరుపుకోనున్నారు అన్నా చెలెల్లు, అక్కా తమ్ముళ్లు. ఈ సందర్భంగా అసలు రక్షా బంధన్ పండును బ్యాన్ చేసిన కొన్ని గ్రామాల గురించి తెలుసుకుందాం..ఉత్తరప్రదేశ్ లోని 60 గ్రామాలకు చెందిన ప్రజలు 300 ఏళ్లుగా ‘రక్షా బంధన్’పండుగను బ్యాన్ చేశారు. దీనికి వెనుక బలమైన కారణమే ఉంది అంటున్నారు ఆ గ్రామస్తులు. మరి ఆ కారణమేంటో తెలుసుకుందాం..
ఉత్తరప్రదేశ్ లోని హార్పూర్ జిల్లా పరిధిలోని 60 గ్రామాల్లో ప్రజలు రక్షా బంధన్ జరుపుకోరు. వీరు రక్షా బంధన్ జరుపుకునే విధానమే చాలా భిన్నంగా ఉంటుంది. దాదాపు నాలుగైదు శతాబ్దాలుగా వారు ఈ పండుగను పూర్తి భిన్నంగా జరుపుకుంటున్నారు. రాఖీ పూర్ణిమ రోజున ఈ గ్రామాల మహిళలు తమ సోదరుల చేతులకు రాఖీలు కట్టరు. దానికి బదులుగా వారు కలప కర్రలకు రాఖీలు కడతారు. దీంతో ఈ గ్రామాల్లో రాఖీ పండుగ నాడు ఎక్కడ చూసినా కర్రలకు రాఖీలు కనిపిస్తాయి.
ఇకపోతే యూపీలోని మీరట్ చుట్టు పక్కల గ్రామాల్లో మరో రకంగా రాఖీ పండుగను జరుపుకుంటారు. మీరట్‌లోని సురానా అనే గ్రామంలో పూర్వకాలం శాపం కారణంగా అక్కడ రక్షా బంధన్ జరుపుకోరు. 12వ శతాబ్దంలో రాఖీ పండుగ రోజున మహ్మద్ ఘోరీ ఆ గ్రామంపై దండెత్తాడు. ఊళ్లో ప్రజలందరినీ చంపేశాడు. ఆ సమయానికి ఆ గ్రామంలోని లేనికారణంగా ఓ మహిళ, ఆమె ఇద్దరు కొడుకులు మాత్రం బతికారు. ఆ తర్వాత చుట్టుపక్కల ఊళ్ల వారు అక్కడికొచ్చి నివసించారు. ఏడాది తర్వాత వారు రాఖీ పండుగ జరుపుకుందామని ప్రయత్నించారు. ఆ రోజున ఓ పిల్లాడు ప్రమాదవశాత్తు చూపు కొల్పోయాడట. దాంతో గ్రామంలో రాఖీపండుగ అంటే కీడు పండుగ అన్నట్లుగా ఆ పండుగనే జరుపుకోవటం మానివేశారు. ఇకనుంచి రాఖీ పండుగను జరుపుకోకూడదు అంటూ నిషేధించారు. అలా గత 300 ఏళ్లుగా రాఖీ పండుగను బ్యాన్ చేశారు.. అప్పటి నుంచి అక్కడ రాఖీ అన్న మాట కనుమరుగైపోయింది.