Ram Bharose : ‘ప్రజల్ని ఇక రాముడే కాపాడాలి’: అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

Ram Bharose : ‘ప్రజల్ని ఇక రాముడే కాపాడాలి’: అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

Only Lord Ram Should Save Says,

“Ram Bharose” Allahabad hc  up healthcare system : కరోనా మొదటి వేవ్ లో మహమ్మారి ప్రభావం ఎక్కువగా నగరాల్లోనే ఎక్కువగా ఉండేది. మరణాలు కూడా నగరాల్లోనే ఉండేవి. కానీ ఈ సెకండ్ వేవ్ చిన్న చితకా పట్టణాలతో పాటు గ్రామాల్ని కూడా వదలటంలేదు. ఆఖరికి తండాలను కూడా వదలట్లేదు. మరణాలు భారీ సంఖ్యలో నమోదువుతున్న క్రమంలో అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లోని గ్రామీణ ప్రాంతాలు కరోనాతో అల్లాడుతున్న క్రమంలో మరణాలు భారీగా నమోదవుతున్న విషాదకర పరిస్థిలపై యూపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి అలహాబాద్ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అలహాబాద్ హైకోర్టు మరోసారి తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేసింది. చిన్న పట్టనాలు..గ్రామాల్లో వైద్యం అందించే మాలిక సదుపాయాల విషయంలో ఆందోళన వ్యక్తం చేసింది.

‘ప్రజలను ఇక రాముడే కాపాడాలి’ అని వ్యాఖ్యానించింది. కరోనా పేషెంట్లకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను విచారించిన జస్టిస్ సిద్ధార్ధ వర్మ, జస్టిస్ అజిత్ కుమార్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే చిన్నచిన్న పట్టణాలు, గ్రామాలను కూడా రాముడే కాపాడాలని వ్యాఖ్యానించింది.

కాగా గత ఏప్రిల్ లో కరోనా బారినపడ్డ సంతోశ్ కుమార్ అనే చికిత్స కోసం మీరట్ హాస్పిటల్‌లో చేరగా..చికిత్స పొందుతున్న సమయంలో బాధితుడు టాయ్‌లెట్‌లో కుప్పకూలిపోయాడు.. తర్వాత అతడిని స్ట్రెచర్‌పై వేసి సపర్యలు చేసినా అప్పటికే అతడు చనిపోయాడు.. ఆ తరువాత అతని మృతదేహాన్ని గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాంగా ఆస్పత్రిలోని వైద్యులు, సిబ్బంది ఏమాత్రం పట్టించుకోలేదు. ఆ తరవాత ఆ మృతదేహం కనిపించకుండాపోయింది. ఈ దారుణ ఘటనపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ..‘‘ఈ ఘటన రాత్రి షిఫ్ట్‌లో ఉన్న డాక్టర్లు, వైద్య సిబ్బంది అజాగ్రత్త, నిర్లక్ష్యానికి పరాకాష్ట’’ అని వ్యాఖ్యానించింది.

సాధారణ రోజుల్లోనే ప్రజలకు అవసరమైన వైద్య సౌకర్యాలు కల్పించే పరిస్థితులు లేవనీ..అటువంటి దుస్థితిలో ఇక ఇలాంటి ఈ కరోనా మహమ్మారి సమయంలో చెప్పేపరిస్థితి లేదు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే వైద్య వ్యవస్థ మొత్తం కుప్పకూలుతుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రజలకు సరిపడా ఆసుపత్రులు కూడా లేవని తీవ్రంగా ప్రభుత్వమీద మండిపడింది. ఒక హెల్త్ సెంటర్ లో దాదాపు 3 లక్షల ప్రజల లోడ్ ఉంటే… అక్కడ కేవలం 30 బెడ్లు మాత్రమే ఉన్నాయని ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం చేస్తోందని తీవ్రంగా ప్రశ్నించింది. అంటే ఒక్కో సీహెచ్‌సీలో కేవలం 0.01 శాతం మంది ప్రజలకు మాత్రమే సేవలందించగుతోందంటూ దుయ్యబట్టింది.

ఇంకా ధర్మాసనం ఈ పరిస్థితులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ..బిజ్‌నోర్ జిల్లాలో లెవల్ -3 ఆసుపత్రి లేదు.. మూడు ప్రభుత్వ ఆసుపత్రులలో 150 పడకలు మాత్రమే ఉంటే.. బీఐపీఏపీ యంత్రాలు 5, హై ఫ్లో నాసిల్ క్యానల్స్ కేవలం రెండే ఉన్నాయి.. ఒక వేళ గ్రామీణ ప్రాంతాల్లో 32 లక్షల మంది ప్రజలుంటే కేవలం 10 సామాజిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి.. అంటే మూడు లక్షల మందికి ఒక సీహెచ్‌సీ.. 30 పడకలు.. దీని ప్రకారం ఒక్కో సీహెచ్‌సీలో 0.01 శాతం మందికి మాత్రమే బీఐపీఏపీ మెషిన్ (వెంటిలేటర్) లేదా నాసిల్ క్యానల్స్ ఉన్నాయి’.

300 పడకలకు 250 సిలిండర్లతో 17 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.. ఆక్సిజన్ సిలిండర్ల సామర్థ్యం ఏంటి, సీహెచ్సీలో ఈ ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ఆపరేట్ చేయడానికి శిక్షణ పొందిన వ్యక్తులు ఉన్నారా అనేది వివరంగా తెలియదు’’ అని అసంతృప్తి వ్యక్తం చేసింది. యూపీలో ఇప్పటి వరకూ 16.19 లక్షల మంది వైరస్ బారినపడ్డారు. గత నెలలో రోజువారీ కేసులు 20 వేల మార్క్ దాటాయి. కానీ.. అక్కడ మెడికల్ ఆక్సిజన్ కొరత లేదని ప్రభుత్వం ప్రకటించడం నిర్లక్ష్యానికి కారణమనీ..ఇంత నిర్థయగా ప్రభుత్వం చెప్పటం పట్ల విస్మయం ధర్మాసనం వ్యక్తమయ్యింది. ఆరోగ్య మౌలిక సదుపాయాల కొరత తీవ్రంగా ఉందని బాధితులే గగ్గోలు పెడుతున్నా..మొర పెట్టుకుంటున్నా..ప్రభుత్వం మాత్రం అటువంటిదేమీ లేదని చెప్పటం గమనించాల్సిన విషయం.