అయోధ్య రామాలయం నమూనా ఇదే

  • Published By: venkaiahnaidu ,Published On : August 4, 2020 / 05:25 PM IST
అయోధ్య రామాలయం నమూనా ఇదే

అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్న రామమందిర ఆలయ ప్రతిపాదిత నమూనాను రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు విడుదల చేసింది. ప్రతిపాదిత ఆలయ నమూనాను రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఇవాళ(ఆగస్ట్-4,2020) ట్విట్టర్​లో అధికారికంగా విడుదల చేసింది.

ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్న రామమందిరానికి బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆగస్టు 5న భూమిపూజ జరగనుంది.పరిమిత సంఖ్యలో ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. అంగరంగ వైభవంగా వేడుక చేసేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.

భారతదేశ వాస్తు శిల్పకళను చాటేలా రామమందిర నిర్మాణం ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆలయ ప్రాంగణమంతా హరితకళను సంతరించుకునేలా తీర్చిదిద్దనున్నట్లు నమూనాలో తెలియచెప్పారు.