Ram-Laxman Trees In Alapally Forest : టేకు చెట్లకు దేవుళ్ల పేర్లు .. పూజలు అందుకుంటున్న భారీ వృక్షాలు

పెంపుడు జంతువులకు పేర్లు పెడుతుంటారు.. ఇల్లు, వనాలు, మైదానాలకు పెద్దలు.. సుప్రసిద్ధుల పేర్లు పెడుతుంటారు. కానీ.. చెట్లకు ఎవరూ ఎక్కడ పేర్లు పెట్టడం చూశామా.. ఏ చెట్టునైనా ఆ వృక్షజాతి పేరుతోనే పిలుస్తాం.. మామిడి, టేకు, వేప.. ఇలా వృక్ష జాతిపేరే ఉంటుంది కాని.. రాముడు.. లక్ష్మణుడు వంటి పేర్లు ఎక్కడ విని వుండరు. కానీ.. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో రెండు టేకు చెట్లకు రామ, లక్ష్మణుల పేర్లు పెట్టి ఓ విశిష్టత సృష్టించారు అటవీ అధికారులు.

Ram-Laxman Trees In Alapally Forest : టేకు చెట్లకు దేవుళ్ల పేర్లు .. పూజలు అందుకుంటున్న భారీ వృక్షాలు

Ram-Laxman Trees In Alapally Forest

Ram- Laxman Trees In  Alapally Forest  : పెంపుడు జంతువులకు పేర్లు పెడుతుంటారు.. ఇల్లు, వనాలు, మైదానాలకు పెద్దలు.. సుప్రసిద్ధుల పేర్లు పెడుతుంటారు. కానీ.. చెట్లకు ఎవరూ ఎక్కడ పేర్లు పెట్టడం చూశామా.. ఏ చెట్టునైనా ఆ వృక్షజాతి పేరుతోనే పిలుస్తాం.. మామిడి, టేకు, వేప.. ఇలా వృక్ష జాతిపేరే ఉంటుంది కాని.. రాముడు.. లక్ష్మణుడు వంటి పేర్లు ఎక్కడ విని వుండరు. కానీ.. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో రెండు టేకు చెట్లకు రామ, లక్ష్మణుల పేర్లు పెట్టి ఓ విశిష్టత సృష్టించారు అటవీ అధికారులు. అసలే సెంటిమెంట్‌ మెండుగా ఉండే భారతీయులు రాముడు.. లక్ష్మణుడు అంటే ఊరికే వదులుతారా ఏమిటి.. ఆ రెండు చెట్లను సాక్షాత్‌ దైవ స్వరూపంగా భావించి పూజలు కూడా చేస్తున్నారు. ఇంట్రస్టింగ్‌గా ఉన్న ఈ రామ్‌ లక్ష్మణ్‌ ట్రీ స్టోరీ ఏమిటో ఇప్పుడు చూద్దాం.

మహారాష్ట్రలో గడ్చిరోలి జిల్లా అహేరి తాలుక ఆలపల్లి సమీపంలో దట్టమైన అడవిలో ఓ టేకు చెట్టు లక్ష్మణ చెట్టుగా పూజలు అందుకుంటోంది. ఈ భారీ వృక్షాన్ని పూజించడానికి నిత్యం వందలాదిగా వస్తుంటారు భక్తులు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలానికి కేవలం ఇరువై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ అడవిలో ఒకప్పుడు రాముడు, లక్ష్మణుడు అనే రెండు టేకు చెట్లు ఉండేవట. రాముడు చెట్టు గతంలో భారీ వృక్షాలకు ఒరిగిపోయిందట. కానీ అప్పటికే దేవుడి స్వరూపంగా పూజలు అందుకున్న ఈ చెట్టు కూలిపోయిన తర్వాత కూడా దాని విశిష్టత కాపాడేలా జాగ్రత్తలు తీసుకున్నారు అటవీ అధికారులు. నేలకూలిన టేకు వృక్షాన్ని చంద్రపూర్ జిల్లా బల్లార్షాలో ఫారెస్ట్ మ్యుజియంలో పెట్టినట్లు చెబుతున్నారు అటవీ అధికారులు.

ఆలపల్లి అడవిలో ప్రస్తుతం లక్ష్మణుడు చెట్టు మాత్రమే ఉంది. ఈ లక్ష్మణుడు చెట్టు వయసు దాదాపు 70 ఏళ్లు ఉంటుందని చెబుతున్నారు అటవీ అధికారులు. సుమారు నూట డెబ్బై అడుగుల ఎత్తు పెరిగిన ఈ భారీ వృక్షాన్ని చాలా జాగ్రత్తగా చూస్తున్నారు ఫారెస్ట్‌ సిబ్బంది. రాముడు చెట్టు లేకపోయినా లక్ష్మణుడి చెట్డును చూడటానికి మహారాష్ట్ర, తెలంగాణ, చత్తీస్‌గఢ్ నుంచి నిత్యం సందర్శకులు వస్తుంటారు.రామ- లక్ష్మణ చెట్లు ఉన్న ఆలపల్లి అటవీ ప్రాంతం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. పెద్ద పెద్ద వృక్షాలు… అక్కడి పచ్చదనం ఎంతో సుందరంగా ఉంటుంది. ఇదో పిక్నిక్‌ స్పాట్‌లా ఉండటంతో సందర్శకులు తెగ ఎంజాయ్ చేస్తుంటారు.

ఈ ప్రాంతాన్ని మహారాష్ట్రలో గ్లోరీ ఆఫ్ ఆలపల్లి అంటుంటారు. ఫారెస్టు కంపార్ట్‌మెంట్ 76లో ఉంటుంది. 6 హెక్టార్లలో రకరకాల చెట్లు ఈ ప్రాంతాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాయి. టెండు, ధవళ, కుసుమ, యొన్, గుంజె, టరోటా, గుల్వేల్ వంటి ఔషధ మొక్కలు ఉన్నట్లు అటవీ అధికారులు చెప్తున్నారు. శని ఆది వారాలతోపాటు సెలవులలో ప్రత్యేకంగా ఈ వృక్షాలను చూడటానికి కుటుంబ సమేతంగా సందర్శకులు వస్తున్నారని చెబుతున్నారు ఫారెస్టు అధికారులు.

అడవిని అందులో టేకు చెట్లను కాపాడాలనే ఉద్దేశంతోనే చెట్లకు దైవత్వం జతకట్టారు ఫారెస్టు అధికారులు. టేకు చెట్లకు దేవుడు పేర్లు పెడితే ఎవరూ వాటిని కొట్టరని.. పైగా ఇలా పూజించి వాటి సంరక్షణ బాధ్యత తీసుకుంటారనే ఉద్దేశంతోనే ఆలపల్లిలో టేకు చెట్లకు పేర్లు పెడుతున్నట్లు అటవీ అధికారులు చెబుతున్నారు. అయితే ఇక్కడ చెట్లకు రకరకాల పేర్లు ఉన్నా.. రామ, లక్ష్మణ చెట్లే బాగా ఫేమస్‌ అయ్యాయి.