అయోధ్యకు ఆహ్వానం…మోడీని కలిసి రామజన్మభూమి ట్రస్టు సభ్యులు

  • Published By: venkaiahnaidu ,Published On : February 20, 2020 / 03:44 PM IST
అయోధ్యకు ఆహ్వానం…మోడీని కలిసి రామజన్మభూమి ట్రస్టు సభ్యులు

ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఆయన నివాసంలో ఇవాళ(ఫిబ్రవరి-20,2020) రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులు కలిశారు ప్రధానిని కలిసిన వారిలో ట్రస్టు అధ్యక్షుడు నిత్య గోపాల్ దాస్ కూడా ఉన్నారు.

రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసులో గతేడాది నవంబర్ 9న సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు అనంతరం….అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని చూసేందుకు మోడీ సర్కార్ 15మంది సభ్యులతో శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. బుధవారం తొలిసారిగా ట్రస్టు సమావేశం జరిగింది.  ఇవాళ ట్రస్టు సభ్యులు  మోడీని కలిశారు.

ఎప్పటి లోగా రామ మందిరాన్ని పూర్తి చేయాలన్న దానిపైనే ప్రధానంగా మోడీ-ట్రస్టు సభ్యుల మధ్య ఇవాళ చర్చ జరిగినట్లు సమాచారం. అంతేకాకుండా మందిర నిర్మాణానికి కావల్సిన విరాళాలపై కూడా వీరు లోతుగా చర్చించారు. అయితే రామ మందిర శంకుస్థాపన జరిగే రోజున అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీని తాము ఆహ్వానించినట్లు వీహెచ్ పీ లీడర్, ట్రస్టు జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ తెలిపారు.