పాకిస్తాన్ జిందాబాద్ అన్న అమూల్యను చంపితే రూ.10లక్షలు బహుమతి

అమూల్య.. ఇప్పుడీ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ఒక నినాదంతో అమూల్య తీవ్ర వివాదానికి దారితీసింది. కాంట్రవర్సీకి కేరాఫ్ అయ్యింది. పాకిస్తాన్ జిందాబాద్ అంటూ

  • Published By: veegamteam ,Published On : February 23, 2020 / 02:44 AM IST
పాకిస్తాన్ జిందాబాద్ అన్న అమూల్యను చంపితే రూ.10లక్షలు బహుమతి

అమూల్య.. ఇప్పుడీ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ఒక నినాదంతో అమూల్య తీవ్ర వివాదానికి దారితీసింది. కాంట్రవర్సీకి కేరాఫ్ అయ్యింది. పాకిస్తాన్ జిందాబాద్ అంటూ

అమూల్య.. ఇప్పుడీ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ఒక నినాదంతో అమూల్య తీవ్ర వివాదానికి దారితీసింది. కాంట్రవర్సీకి కేరాఫ్ అయ్యింది. పాకిస్తాన్ జిందాబాద్ అంటూ కలకలం రేపింది. పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా కర్నాటక రాజధాని బెంగళూరు నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో ‘పాకిస్తాన్ జిందాబాద్’ అని నినదించిన అమూల్య లియోనా తలకు శ్రీరాంసేన వెలకట్టింది. ఆమె చంపిన వారికి రూ.10 లక్షలిస్తామని ఓ వీడియోలో ప్రకటించింది. ఆ వీడియో ఫుటేజీలో శ్రీరాం సేన కార్యకర్త సంజీవ్ మరాడి మాట్లాడుతూ.. అమూల్యను విడుదల చేయవద్దని ప్రభుత్వాన్ని కోరారు. ఒకవేళ ఆమెను విడుదల చేస్తే చంపేస్తామని హెచ్చరించారు. 

‘‘రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఆమెను ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల చేయొద్దు. ఒకవేళ ఆమె బయటకి వచ్చిందంటే చంపేస్తాం’’ అని ఆ వీడియోలో సంజీవ్ హెచ్చరించారు. అంతేకాదు, ఆమెను చంపిన వారికి రూ. 10 లక్షలు బహుమతిగా ఇస్తామని కూడా ప్రకటించారు.

సీఏఏ, ఎన్‌ఆర్‌సీలకు వ్యతిరేకంగా గురువారం(ఫిబ్రవరి 20,2020) సాయంత్రం బెంగళూరు ఫ్రీడంపార్క్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ సహా పలువురు ఈ ర్యాలీకి హాజరయ్యారు. ఈ సభలో అమూల్య లియోన్‌ అనే యువతి.. వేదికపై పాకిస్తాన్‌ జిందాబాద్‌ అంటూ నినాదాలు చేసింది. దీంతో కంగుతిన్న నిర్వాహకులు ఆమె నుంచి మైక్‌ లాక్కుందామని ప్రయత్నించినా.. అమూల్య నినాదాలు కొనసాగించింది. పోలీసులు అమూల్యను అరెస్ట్ చేశారు. దేశద్రోహం కేసు నమోదు చేశారు. 14 రోజుల పాటు ఆమెను జ్యుడిషియల్‌ కస్టడీకి తీసుకోవాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశించారు. దేశ ప్రజల్లో విద్వేషాలు పెంచడానికి ప్రయత్నించిందని అమూల్యపై ఆరోపణలు వెల్లువెత్తాయి.

అమూల్య(18) బెంగళూరులోని ఒక కాలేజీలో చదువుతోంది. ఆమె ఇంతకు ముందు సీఏఏ వ్యతిరేక ర్యాలీలో కన్నడ భాషలో ఇచ్చిన ప్రసంగంతో చర్చల్లో నిలిచింది. ఫేస్‌బుక్‌లో పరిచయం చేసుకుంటూ తను కొప్పాలో నివసిస్తానని, బెంగళూరు NMKRV కాలేజ్ ఫర్ విమెన్‌లో చదువుతున్నానని చెప్పింది.

ఈ ఘటనపై ఆగ్రహించిన ఒవైసీ తర్వాత ‘పాకిస్తాన్ ముర్దాబాద్’ నినాదాలు చేశారు. ఉదారవాదులపై విరుచుకుపడ్డారు. “నేను ఈ సోకాల్డ్ లిబరల్స్‌కు చెబుతున్నా. మీరు మీ షాహీన్‌బాగ్, బిలాల్ బాగ్ తయారు చేసుకోండి. మాకు వచ్చి చెప్పకండి. మీరే సమర్థులని, మేము అసమర్థులని మీరు అనుకుంటున్నారు. మాకు మీ పాట్రనైజింగ్ ఆటిట్యూడ్ (పరిరక్షణ వైఖరి) అవసరం లేదు” అని అన్నారు. దీనిపై స్పందించిన బీజేపీ నేతలు.. అమూల్య దేశద్రోహి అన్నారు. ఆమెలాంటి వారు ఇంకా చాలామంది దేశద్రోహులు ఉన్నారని ఆరోపించారు. పాకిస్తాన్ మద్దతుదారులు భారత్‌లో అశాంతి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.