అయోధ్యలో జనవరి 15 నుంచి రామ మందిర నిర్మాణం

అయోధ్యలో జనవరి 15 నుంచి రామ మందిర నిర్మాణం

Ram Temple:అద్భుతమైన రామ మందిరాన్ని ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య వేదికగా ఘనంగా నిర్మించనున్నారు. ఈ మేరకు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ట్రెజరర్ స్వామి గోవింద్ దేవ్ గిరి మంగళవారం వెల్లడించారు. అయోధ్యలో ట్రస్టు సభ్యులు రెండ్రోజుల పాటు మీటింగ్ హాజరై తుది నిర్ణయం తీసుకున్నారు.

లార్సెన్ అండ్ టబ్రో, టాటా కన్సల్టింగ్ ఇంజినీర్స్ లిమిటెడ్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్, ఐఐటీ రూకీ, ఆర్కిటెక్ట్ ఆఫ్ ఆచార్ ధాం టెంపుల్ ఆర్కిటెక్ట్ బ్రహ్మం విహారీ స్వామిలతో పాటు రామ్ టెంపుల్ ఆర్కిటెక్ట్ ఆశిశ్ సోంపూరాలు మీటింగ్ లో పాల్గొన్నారు.



ప్రెస్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. స్వామి గోవింద్ దేవ్ ఫౌండేషన్ నిర్మాణం గురించి ఫైనల్ రిపోర్ట్ సబ్ మిట్ చేయాల్సి ఉంది. ఓ నెల రోజుల తర్వాత గానీ, నిర్మాణం మొదలుకాదని అన్నారు. దీంతో పాటుగా అక్కడ ఉన్న 65ఎకరాల భూమిని కూడా ల్యాండ్ ఆఫ్ ద రామ్ జన్మభూమి పరిసర్ డెవలప్మెంట్ ప్రాజెక్టులపై కూడా చర్చించారు.

వేదిక్ సిటీలో శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ.. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు. చీఫ్ జస్టిస్ రంజన్ గోగొయ్ ప్రకారం.. ఐదుగురు జడ్జిల కన్‌స్టిట్యూషన్ బెంచ్ రామ జన్మభూమిలోనే అయోధ్య నిర్మాణం జరగాలని హిందువుల నమ్మకం.