రూ.1100కోట్లతో మూడేళ్లలో అయోధ్య రామాలయం పూర్తి

రూ.1100కోట్లతో మూడేళ్లలో అయోధ్య రామాలయం పూర్తి

Ram temple in 3 years అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని రూ.1,100 కోట్లు ఖర్చుతో మూడేళ్లలో పూర్తి చేస్తామని రామ్‌జన్మభూమి తీర్థ క్షేత్ర న్యాస్‌ ట్రస్ట్‌ ట్రెజరర్‌ స్వామి గోవింద్‌దేవ్‌ గిరి మహరాజ్‌ తెలిపారు. ప్రధాన ఆలయం రూ. 300 నుంచి రూ. 400 కోట్లు ఖర్చుతో మూడేళ్లలో పూర్తయిపోతుందని, అయితే ఆలయం చుట్టూ మొత్తం 70 ఎకరాల ఆలయ భూమిని అభివృద్ధి చేయడానికయ్యే మొత్తం ఖర్చు రూ.1,100 కోట్లు దాటిపోతుందని గిరి మహరాజ్‌ చెప్పారు.

ఆలయ నిర్మాణ వ్యయా నికి సంబంధించి ఇప్పటివరకు న్యాస్‌ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదని, ఇందులో భాగస్వాములైన నిర్మాణ రంగ నిపుణులతో చర్చించిన తర్వాతే ఇప్పుడు ఈ ప్రకటన విడుదల చేస్తున్నామని తెలిపారు. రామ మందిర నిర్మాణం కోసం ఎంత ఖర్చు అవుతుందో ఇప్పటివరకూ ఎవరూ అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఒక మరాఠా న్యూస్‌ చానెల్‌తో మాట్లాడుతూ గోవింద్‌ దేవ్‌ ఈ వివరాలు వెల్లడించారు. భక్తుల నుంచి నిధులు సమీకరించడం ద్వారానే మందిరం నిర్మిస్తామన్నారు. దేశవ్యాప్తంగా 6.5 లక్షల గ్రామాలు, 15 కోట్ల ఇళ్ల నుంచి నిధులు సేకరించడమే తమ లక్ష్యమని తెలిపారు.