రామమందిరం కోసం ప్రత్యేకమైన రాయి కావాలని కోరుతున్న రాజస్థాన్

రామమందిరం కోసం ప్రత్యేకమైన రాయి కావాలని కోరుతున్న రాజస్థాన్

Ram temple: రాజస్థాన్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ అంశాలపై పర్మిషన్ కోరుతుంది. బన్సీ పహార్‌పూర్, భారత్‍పూర్ బ్యాండ్ బరేతా బ్లాక్ కు సంబంధించిన అటవీ సంపద రామమందిరానికి కావాల్సి ఉంది. అక్కడ దొరికే పింక్ శాండ్ స్టోన్ తో మందిర నిర్మాణం చేయాలని ప్లాన్ చేస్తుంది.

లక్ష క్యూబికక్ ఫీట్ల బన్సీ పహార్‌పూర్ శాండ్ స్టోన్ ఉందని సమాచారం అందుకుంది. దీంతో నిర్మాణం చేపడితే అయోధ్య రామ మందిరానికి ప్రత్యేక రాయి వాడినట్లు అవుతుందనేదే ప్లాన్.



నిజానికి 2016 తర్వాత ఎటువంటి మైనింగ్ జరపడానికి వీల్లేదని ఆర్డర్లు వచ్చేశాయి. ఈ పింక్ శాండ్ స్టోన్ ను బ్లాక్ లో అమ్ముతుండగా భారత్ పూర్ అడ్మినిస్ట్రేషన్ 25ట్రక్కులను సీజ్ చేయడంతో సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ఆ పింక్ శాండ్ స్టోన్ కు పోయిన దాఖలాల్లేవ్.

‘రాజస్థాన్ లో రామ మందిర నిర్మాణం జరపడమనేది దేశానికి సంబంధించన పనిగా కాంగ్రెస్ భావించాలి. ఓ అవాంతరం వచ్చిన ప్రతీసారి సమాధానం దొరుకుతూనే ఉంటుంది. రాజ్యాంగబద్ధంగా బన్సీ పహార్ పూర్ గనుల్లో ఏం చేసినా మాకు సమ్మతమే’ అని విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధి శరత్ శర్మ మీడియాతో అంటున్నారు.

ఏదో ఒక ప్రత్యేకమైన కారణానికి ఈ రాయిని సరఫరా చేయలేం. దేశం మొత్తంలో దీనికి చాలా డిమాండ్ ఉంది. ఈ నిర్ణయం రెవెన్యూ, గనులు, అటవీ శాఖల జాయింట్ సర్వేలో మాత్రమే తేలనుందని భరత్ పూర్ జిల్లా మెజిస్ట్రేట్ నాథ్మల్ దిదేల్ అన్నారు.
https://10tv.in/a-meteorite-fell-on-this-coffin-makers-house/
మేం దీని కోసం 556 హెక్టార్లు సర్వే చేశాం. ప్రస్తుతం పింక్ శాండ్ స్టోన్ గురించి అప్లికేషన్ పెడుతున్నాం అని భరత్‌పూర్ సర్కిల్ సూపరిండెంట్ మైనింగ్ ఇంజినీర్ ఇన్‍ఛార్జ్ అన్నారు. ‘అక్రమంగా మైనింగ్ చేయడంలో పింక్ శాండ్ స్టోన్ మీద టార్గెట్ ఎక్కువ. ధోల్‌పూర్‌లో దొరికే ఒక్క క్యూబిక్ ఫీట్ రెడ్ స్టోన్‌కు రూ.500వరకూ డిమాండ్ ఉంటుంది. ఉత్తరప్రదేశ్ లోని చాలా ప్రాంతాల్లో, రామాలయాల్లో ఏనుగు విగ్రహాలకు దీనినే వాడుతుంటారు అని దిలీప్ సింగ్ రాథోడ్ అన్నారు. మైనింగ్ నిషేదం కారణంగా 2016లో అతని లీగల్ మైన్ ను కూడా మూసేయాల్సి వచ్చింది.




ఈ బన్సీ పహార్ పూర్ అనేది కింగ్ ఆఫ్ శాండ్ స్టోన్. దీనిని ఇతర ఎర్ర చుక్కలు, గీతలతో కలిపితే అంత చూడముచ్ఛటగా అనిపించకపోవచ్చు. అనుకున్నంత మొత్తంలో సరఫరా లేకపోతే మన దగ్గరున్న ఒకే ఒక్క సొల్యూషన్ ప్రత్యామ్న్యాయంగా ఇంకొక రాయిని ఎంచుకోవడమే. అని ఆశిష్ సోంపుర అంటున్నారు.