నెలవంక దర్శనం : పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం

ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా భావించే మాసం రంజాన్. సోమవారం (మే 6,2019) సాయంత్రం ఆకాశంలో నెలవంక కనిపించడంతో రంజాన్ మాసం ప్రారంభమైంది. ముస్లిం

  • Published By: veegamteam ,Published On : May 7, 2019 / 01:56 AM IST
నెలవంక దర్శనం : పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం

ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా భావించే మాసం రంజాన్. సోమవారం (మే 6,2019) సాయంత్రం ఆకాశంలో నెలవంక కనిపించడంతో రంజాన్ మాసం ప్రారంభమైంది. ముస్లిం

ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా భావించే మాసం రంజాన్. సోమవారం (మే 6,2019) సాయంత్రం ఆకాశంలో నెలవంక కనిపించడంతో రంజాన్ మాసం ప్రారంభమైంది. ముస్లిం సోదరులు మంగళవారం (మే 7,2019) నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభించారు. రంజాన్ నెల ఆరంభం నుంచి 30 రోజుల పాటు ఉపవాస దీక్షలు పాటిస్తారు. ప్రతి రోజూ ఐదుసార్లు నమాజ్ చేస్తారు. తెల్లవారుజామున 4 గంటలకు అల్పాహారాన్ని తీసుకుంటారు. దీన్నే సహర్ అంటారు. తెల్లవారిన తర్వాత సూర్యుడు అస్తమించే వరకు పచ్చి మంచి నీళ్లు కూడా తీసుకోకుండా దీక్షను పాటిస్తారు. సాయంత్రం ఉపవాసాన్ని విరమిస్తారు. దీన్ని ఇఫ్తార్ అంటారు. దీక్ష విరమించాక ఇఫ్తార్ విందులు ఇస్తారు.

ఈ నెలలో ముస్లింలు జకాత్ రూపంలో పేదలకు తమ ధనంలో రెండున్నర శాతం సొమ్మును దానం చేస్తారు. ఈ మాసంలోనే హజ్ యాత్ర చేస్తారు. రంజాన్ మాసానికి ఇస్లాంలో అత్యంత ప్రాధాన్యత ఉంది. ముస్లిం దివ్య గ్రంథమైన పవిత్ర ఖురాన్ ఈ మాసంలోనే దివి నుంచి భువిపైకి వచ్చిందని.. ఇస్లాంలో ఈ మాసానికి ప్రాధాన్యత ఉందని మత గురువులు చెబుతారు. రంజాన్ మాసం ప్రారంభం కావడంతో నగరంలోని వందల సంఖ్యలో ఉన్న మసీదులను ముస్తాబు చేశారు. ప్రార్థనల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం సమాజంలో సంతోషాన్ని, సోదర భావాన్ని, సామరస్యాన్ని పెంపొందించాలని ఆకాంక్షించారు. సౌదీ జైళ్లలో మగ్గుతున్న 850 మంది భారతీయులను రంజాన్‌ పర్వదినంలోగా వదిలిపెట్టడానికి సౌదీ అరేబియా అంగీకరించిందని ప్రధాని తెలిపారు.

ఏపీ సీఎం చంద్రబాబు రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ఉపవాసం ఆధ్యాత్మికపరమైనదేనని, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెప్పారు. అసత్యాలకు, దూషణలకు దూరంగా ఉండటం.. దయాగుణం, దానగుణం కలిగి ఉండటం సత్ ప్రవర్తనకు మార్గాలని అన్నారు. ఈ లక్షణాలు అలవర్చుకుని జీవితమంతా కొనసాగించేందుకు రంజాన్ స్ఫూర్తినిస్తుందని చంద్రబాబు తెలిపారు. తెలంగాణలో రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం ఉద్యోగులకు మినహాయింపులు ఇచ్చింది. సాయంత్రం 4 గంటలకే కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్లే వెసులుబాటు కల్పించింది. భారత్ సహా పాకిస్తాన్, బంగ్లాదేశ్, దక్షిణ ఆసియా దేశాల్లోనూ రంజాన్ మాసం ప్రారంభమైంది. సౌదీ అరేబియా, యూఏఈ, కతార్, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాలోనూ రంజాన్ మాసం ప్రారంభమైనట్టు మత గురువులు ప్రకటించారు.