ముస్లింల సమాధులపై శ్రీ రాముడికి గుడి కడతారా..ఇదేనా హిందూ సనాతన ధర్మం?

  • Published By: veegamteam ,Published On : February 18, 2020 / 06:21 AM IST
ముస్లింల సమాధులపై శ్రీ రాముడికి గుడి కడతారా..ఇదేనా హిందూ సనాతన ధర్మం?

ముస్లింల సమాధులపై శ్రీ రాముడికి గుడి కడతారా? ఇది హిందూ సనాతన ధర్మానికి విరుద్ధం అంటూ రామజన్మభూమి ట్రస్టు  లాయ‌ర్ కే ప‌ర‌శ‌ర‌న్‌కు ముస్లిం ప్రజల న్యాయవాది ఎం.ఆర్ షంషాద్ లేఖ రాశారు. సుప్రీంకోర్టు తీర్పు నేప‌థ్యంలో అయోధ్య‌లో రామాల‌య నిర్మాణానికి కేంద్ర ప్ర‌భుత్వం ట్ర‌స్టును ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. 

రామాల‌య నిర్మాణం స‌నాత‌న ధ‌ర్మానికి విరుద్ధంగా ఉంద‌ని ఆ లేఖ‌లో ముస్లింలు ఆరోపించారు. ధ్వంసం చేయ‌బ‌డ్డ బాబ్రీ మ‌సీదు ప్రాంతంలో ముస్లింల స‌మాధులు ఉన్నాయ‌నీ..ఆ స‌మాధుల‌పై రామాల‌యాన్ని నిర్మించ‌డం స‌నాత‌న ధ‌ర్మానికి విరుద్ధ‌మ‌ని ముస్లిం త‌ర‌పున న్యాయ‌వాది షంషాద్  ట్ర‌స్టుకు ఫిబ్రవరి 15న  రాసిన లేఖలో పేర్కొన్నారు. 

1885లో జ‌రిగిన అల్ల‌ర్ల‌లో 75 మంది ముస్లింలు చ‌నిపోయార‌ని..వారిని బాబ్రీ మసీదు పరిసరాల్లో ఖననం చేశారనీ ఇప్పటికీ వారి స‌మాధులు అక్క‌డే ఉన్నాయ‌ని, బాబ్రీ మ‌సీదు ప్రాంతాన్ని శ్మ‌శాన‌వాటిక‌గా వాడార‌నీ..అటువంటి ఖనన ప్రాతంలో రామాల‌యాన్ని ఎలా నిర్మిస్తార‌ని ఆ లేఖ‌లో ప్ర‌శ్నించారు.  

ముస్లింల స‌మాధుల‌పై రాముడి జ‌న్మ‌స్థాన ఆల‌యాన్ని నిర్మిస్తారా?ఇది హిందూ ధ‌ర్మాన్ని ప‌రిర‌క్షిస్తుందా? సనాతన ధర్మాన్ని పాటించే హిందూవుల ఆలయం ముస్లింల సమాధులు నిర్మించటం ఎంతటి విరుద్ధమో  ట్ర‌స్టు ఆలోచించాలని దీనిపై  నిర్ణ‌యం తీసుకోవాల‌ని లేఖ‌లో కోరారు. 

67 ఎక‌రాల భూమిలో సుమారు 5 ఎక‌రాల స్థ‌లంలో ముస్లింల శ్మ‌శాన‌వాటిక ఉంద‌ని శంషాద్ తెలిపారు.  మొత్తం 67 ఎక‌రాల భూమిని ఆల‌య నిర్మాణం కోసం వాడుకోవడాన్ని ముస్లిం సంఘాలు వ్య‌తిరేకిస్తున్న‌ట్లు న్యాయ‌వాది తెలిపారు.  

“ఇప్పుడు మీరందరూ ధర్మకర్తలు.. సమకాలీన భారతదేశంలో గొప్ప వ్యక్తులు..హిందూ సనాతన్ అభ్యాస రంగంలో ఉత్తమ జ్ఞానం..అనుభవం కలిగివారు మీరు. సనాతన ధర్మం యొక్క మత గ్రంథాల దృష్ట్యా మీరు రామ్ జనమ్స్థాన్ ఆలయాన్ని ముస్లింల సమాధులపై నిర్మించగలరా? దీనికి మీ ధర్మం అంగీకరిస్తుందా? ఇటువంటి కీలక అంశాలపై ట్రస్ట్ ఆలోచించాల్సిన అవసరం చాలా చాలా ఉందని లేఖలో పేర్కొన్నారు. 67 ఎకరాల భూమిలో ముస్లింల వాదనను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆయన ఈ సందర్భంగా అన్నారు.  

Read More>>లేడీస్ సీట్లోంచి లేవమన్నందుకు మహిళను కత్తితో పొడిచేశాడు