రామాయణం, మహాభారతం చూస్తున్నారా

  • Published By: chvmurthy ,Published On : March 28, 2020 / 07:58 AM IST
రామాయణం, మహాభారతం చూస్తున్నారా

ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్ర‌జలంతా ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌వుతున్నారు.  మన దేశంలో లాక్‌డౌన్ విధించ‌డంతో సెల‌బ్రిటీలు సైతం సెల్ప్ కార్వంటైన్‌లోకి వెళ్లిపోయారు. ప్రధాన వినోద సాధనమైన టీవీ సీరియల్స్ లోనూ కొత్త ఎపిసోడ్ లు లేక పాత ఎపిసోడ్ లను, సీరియల్స్ ను రీ టెలికాస్ట్ చేస్తు ప్రజలను అలరిస్తున్నాయి పలు టీవీ ఛానళ్లు.

ఈసమయంలో  1987 లో దూరదర్శన్ లోప్రసారమై ప్రజలను భక్తిభావంతో ఓలలాడించిన రామానంద్ సాగర్ రామాయణం ధారావాహికను దూరదర్సన్ ఛానల్ శనివారం ఉదయం ప్రసారం చేసింది. దీని 2వ  భాగం ఈ రోజు రాత్రి ప్రసారం అవుతుంది. దేశమంతా కరోనా లాక్‌డౌన్‌లో ఉన్న నేపథ్యంలో ప్రజల కోరిక మేరకు ఈ ఆధ్యాత్మిక సీరియల్‌ను మరోసారి ప్రసారం చేయాలని నిర్ణయించినట్లు కేంద్రం తెలపింది.  

రామాయణం  సీరియల్ ను మార్చి28, శనివారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు ఒక ఎపిసోడ్, తిరిగి రాత్రి 9 నుంచి 10 గంటల వరకు మరో ఎపిసోడ్‌ను దూరదర్శన్‌లో చూడొచ్చని  కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ శుక్రవారం  ట్విట్టర్‌లో ప్రకటించారు. 1987లో మొదటిసారిగా దూరదర్శన్‌లో రామాయణం ప్రసారమైన విషయం తెలిసిందే. మరో వైపు  డీడీ భారతి లో మహాభారత్ ను ప్రసారం చేస్తున్నట్లు ఆయన పేర్కోన్నారు.