Ramdev Baba: ముస్లింలపై విధ్వేష వ్యాఖ్యలు.. రాందేవ్ బాబాపై కేసు నమోదు

అయితే తన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతాయని భావించిన రాందేవ్.. తాను ఎవరినీ విమర్శించడం లేదని, జరుగుతున్న వాస్తవం చెబుతన్నానని వివరణ ఇచ్చుకున్నారు. ‘‘కొందరు వ్యక్తులు యావత్ ప్రపంచాన్ని ఇస్లాం స్టేట్‌గా మారుస్తామని మాట్లాడుతుంటారు. కొందరు వ్యక్తులు యావత్ ప్రపంచం క్రైస్తవంలోకి మారాలని చెబుతుంటారు. ఇంతకుమించి వీరికి ప్రత్యేక ఎజెండా ఏమీ లేదు.

Ramdev Baba: ముస్లింలపై విధ్వేష వ్యాఖ్యలు.. రాందేవ్ బాబాపై కేసు నమోదు

Ramdev Baba: భిన్న మతాల మధ్య సహృద్భావ వాతావరణాన్ని పాడు చేస్తున్నారన్న కారణంతో యోగా గురువు రాందేవ్ బాబాపై ఆదివారం కేసు నమోదు అయింది. రాజస్థాన్‭లోని చైహాటాన్ ప్రాంతానికి చెందిన పఠాయి ఖాన్ అనే వ్యక్తి స్థానిక పోలీస్ స్టేషనులో ఈ ఫిర్యాదు నమోదు చేశారు. రాజస్థాన్‭లోని బర్మార్ ప్రాంతంలో జరిగిన సాధువుల సమావేశంలో రాందేవ్ మాట్లాడుతూ ముస్లింలు విద్వేషం వ్యాప్తి చేస్తున్నారని చెప్తూనే హిందూయిజాన్ని ఇస్లాం, క్రైస్తవంతో పోలుస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

BJP vs Congress: ముషార్రఫ్ మరణంపై థరూర్ కామెంట్స్ ఎఫెక్ట్.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం

కాగా, తాజా ఎఫ్ఐఆర్ మీద చౌహాటన్ పోలీస్ స్టేషన్ ఎస్‭హెచ్ఓ మాట్లాడుతూ భారత శిక్ష స్మృతిలోని సెక్షన్ 153ఏ (జాతి, మత, ప్రాంతం, పుట్టుక, నివాసం, భాష ఆధారంగా రెండు సమూహాల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టడం), 295ఏ (ఇతర మతాల్ని ఉద్దేశపూర్వకంగా కించపరిచి అసహజ వాతావారణం ఏర్పడడానికి కారణం కావడం), 298 (రెచ్చగొట్టే ఉద్దేశంతో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం) వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Asaduddin Owaisi: యోగి ‘హిందుత్వ’ వ్యాఖ్యలపై మండిపడ్డ ఓవైసీ.. రాజ్యాంగ ప్రమాణం గుర్తుంచుకోవాలంటూ హితవు

ఫిబ్రవరి 2న జైపూర్‌లోని బర్మెర్‌లో జరిగిన సాధువుల సమావేశంలో రాందేవ్ మాట్లాడుతూ ”ముస్లింలు రోజుకు ఐదుసార్లు నమాజ్ చేశారు. నమాజ్ తర్వాత వాళ్లేం చేయాలనుకుంటున్నారో అది చేస్తారు. హిందూ అమ్మాయిలను ముస్లింలు కిడ్నాప్ చేస్తారు. వాళ్లు అన్నిరకాల పాపాలకు పాల్పడతారు. మన ముస్లిం సోదరులు అనేక పాపాలు చేసినా నమాజ్ మాత్రం తప్పనిసరిగా చేస్తారు. అలా చేయమని వాళ్లకు వాళ్ల మత గురువులు, కుటుంబీకులు నేర్పుతారు. కానీ హిందూ మతం అలాంటిది కాదు. కేవలం మంచి చేయమని మాత్రమే చెప్తుంది” అని అన్నారు.

Aaditya Thackeray: చిన్న పిల్లాడు, అంత మెచ్యూరిటీ లేదు.. ఆదిత్య థాకరే ఛాలెంజ్‭పై షిండే సేన

అయితే తన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతాయని భావించిన రాందేవ్.. తాను ఎవరినీ విమర్శించడం లేదని, జరుగుతున్న వాస్తవం చెబుతన్నానని వివరణ ఇచ్చుకున్నారు. ‘‘కొందరు వ్యక్తులు యావత్ ప్రపంచాన్ని ఇస్లాం స్టేట్‌గా మారుస్తామని మాట్లాడుతుంటారు. కొందరు వ్యక్తులు యావత్ ప్రపంచం క్రైస్తవంలోకి మారాలని చెబుతుంటారు. ఇంతకుమించి వీరికి ప్రత్యేక ఎజెండా ఏమీ లేదు. ముస్లింలు టెర్రరిస్టులుగా, నేరస్థులుగా మారుతున్నప్పటికీ నమాజ్ మాత్రం చేస్తుంటారు. తెల్లవారుజామునే లేవాలి, భగవంతుడిని ప్రార్థించాలి, యోగా చేయాలి, మంచి పనులు చేయాలి, మంచి ఆలోచనలు చేయాలి, ఇష్టదైవాన్ని పూజించాలని హిందూయిజం చెబుతుంది. సనాతన ధర్మం మనకు బోధించేది ఇదే” అని రామ్‌దేవ్ అన్నారు.