పోలీస్ నిఘాలో రామేశ్వరం..పంబన్ రైల్ బ్రిడ్జ్

  • Published By: veegamteam ,Published On : January 25, 2020 / 08:19 AM IST
పోలీస్ నిఘాలో రామేశ్వరం..పంబన్ రైల్ బ్రిడ్జ్

ఆదివారం జనవరి 26..గణతంత్ర దినోత్సవం సందర్భంగా తమిళనాడులోని రామేశ్వరం పంబన్ వంతెన వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.  పెట్రోలింగ్ తీవ్రతరం చేశారు. వంద సంవత్సరాలు దాటిన ఈ వంతెన వద్ద గార్డులు వేయి కళ్లతో కావలికాస్తున్నారు. 

భారత దేశంలో సముద్రంపై నిర్మించిన మొట్టమొదటి వంతెన పంబన్ వంతెన. ఇది శ్రీలంకకు భారత్ కు మధ్య గల పాక్ జలసంధిపై నిర్మించిన ఈ వంతెనకు 2014నాటికి వందేళ్లు పూర్తయ్యాయి. పాంబన్ ద్వీపానికి రామేశ్వరం పట్టణాన్ని కలిపే వారధి పంబన్ వంతెన. ఈ వంతెన భద్రత కోసం జిల్లాలో 12 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి అనుక్షణం అప్రమత్తంగా పర్యవేక్షిస్తున్నారు. గణతంత్ర వేడుకల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరకుండా అన్ని పటిష్ట ఏర్పాట్లు చేశామని పోలీసు సూపరింటెండెంట్ ఎన్‌ఎం మైల్వాహనన్ తెలిపారు.

భద్రతలో భాగంగా పోలీసులు లాడ్జీలు..హోటళ్ళను తనిఖీ చేపట్టారు. జిల్లా అంతటా బైక్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. పంబన్ రైలు వంతెనపై పోలీసు గార్డులు అనుక్షణం వేయి కళ్లతో పర్యవేక్షిస్తున్నారు. పంబన్ రోడ్ వంతెన వద్ద హైవే పెట్రోలింగ్ తీవ్రమైంది. రామేశ్వరం శ్రీ రామనాథస్వామి ఆలయంలో తమిళనాడు స్పెషల్ పోలీసుల నిఘాపెట్టారు.  తీరప్రాంతాలలో, ముఖ్యంగా అరిచల్మునై వద్ద, శ్రీలంక నుండి చొరబాటుదారులకు ల్యాండింగ్ పాయింట్ వద్ద కూడా నిఘా తీవ్రమైంది.

ఆదివారం రిపబ్లిక్ దినోత్సవ వేడుకలకు వేదిక అయిన సీతకతి సేతుపతి స్టేడియంపై ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నేతృత్వంలోని పోలీస్  బృందం భద్రతను పర్యవేక్షిస్తుందనీ..స్నిఫర్ కుక్కల సహాయంతో మొత్తం వేదికను స్కాన్ చేస్తామని ఎస్పీ తెలిపారు.రెండు ఎంట్రీ పాయింట్ల వద్ద డోర్-ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేసామని.. సందర్శకులు వేదిక వద్ద మెటల్ డిటెక్టర్లతో నిరంతరం చెక్కింగ్ కు చేస్తామని మొత్తానికి పంబన్ వంతెన గణతంత్ర వేడుకల సందర్భంగా పోలీసులు నిఘాలో ఉంది.