Ramgopal Varma : ‘దీదీ ఓ దీదీ’ ఫిల్మ్ వర్మ ట్వీట్..వీడియో వైరల్

వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ..ఎప్పుడు వార్తల్లో నిలిచే..సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఎన్నిక రిజల్ట్స్ పై సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ వీడియో తెగ వైరల్ గా మారంది.

Ramgopal Varma : ‘దీదీ ఓ దీదీ’ ఫిల్మ్ వర్మ ట్వీట్..వీడియో వైరల్

Ramgopal

West Bengal Assembly Election : వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ..ఎప్పుడు వార్తల్లో నిలిచే..సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఎన్నిక రిజల్ట్స్ పై సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ వీడియో తెగ వైరల్ గా మారంది. ప్రధానంగా పశ్చిమ బెంగాల్ లో బీజేపీ పరాజయం చెందిన సంగతి తెలిసిందే. ఈ ఫలితం తేలాకా..రామ్ గోపాల్ వర్మ..ట్విట్టర్ వేదికగా..ఓ ట్వీట్ చేశారు. దీదీ ఓ దీదీ..ఫిల్మ్..మమతా, మోడీ ..అమిత్ అంటూ..ఓ క్యాప్షన్ ఇచ్చి..వీడియో పోస్టు చేశారు.

ఇందులో ఓ మహిళ..బ్యాగు వేసుకుని..రోడ్డుపై నడుచుకుంటూ వస్తోంది. వెనుకాలే బైక్ పై వచ్చిన ఇద్దరు యువకులు..బ్యాగ్ ను తస్కరించేందుకు రెడీ అయ్యారు. దీనిని ముందుగానే గ్రహించిన ఆ మహిళ..అమాంతం..బ్యాగ్ ను దూరంగా పారేసింది. బ్యాగ్ ను తీసుకొనేందుకు..ఇద్దరు వ్యక్తులు వెళ్లగా..ఆ మహిళ..బైక్ ను తీసుకుని వెళ్లిపోయింది.

ఇది చూసిన ఆ వ్యక్తులు..మహిళను పట్టుకొనేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఏమి చేసేది ఏమీ లేక..బ్యాగ్ పట్టుకుని..బాధ పడుతూ..వస్తుంటారు. వెనుకాలే..బైక్ పై వచ్చిన ఆ మహిళ..వారి చేతిలో ఉన్న బ్యాగ్ ను అమాంతం పట్టుకుని వెళ్లిపోయింది. ఈ వీడియోను చూసిన బీజేపీ లీడర్స్ ఫైర్ అవుతున్నారు. ‘దీదీ ఓ దీదీ’ ఫిల్మ్ అంటూ వర్మ పోస్ట్ చేసిన వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. వర్మ మాములోడు కాదు..అంటూ కామెంట్స్ వేస్తున్నారు.