ఈ ఏడాది గూగుల్ లో ఎక్కువమంది వెతికింది వీళ్లకోసమే

  • Published By: venkaiahnaidu ,Published On : December 11, 2019 / 11:44 AM IST
ఈ ఏడాది గూగుల్ లో ఎక్కువమంది వెతికింది వీళ్లకోసమే

 2019లో గూగుల్‌లో అత్యధికంగా ప్రజలు సెర్చ్ చేసిన ప్రముఖుల లిస్ట్ ను గూగుల్ ఇండియా విడుదల చేసింది. గూగుల్ ఇండియా విడుదల చేసిన ఈ జాబితాలో వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ మొదటి స్థానంలోనిలిచారు. బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ నేపథ్యంలో భారత్‌పై పాకిస్థాన్ దాడికి దిగిన విషయం తెలిసిందే. ఈ దాడులను ఎదుర్కొనే ప్రయత్నంలో ఫిబ్రవరి 27న పాక్‌కు చేందిన యుద్ధ విమానాన్ని అభినందన్ కూల్చేశారు. అయితే ఆయన నడుపుతున్న మిగ్ 21 ఫైటర్ పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో కూలిపోయింది. ఆ తర్వాత అభినందన్‌ను పాక్ జవాన్లు అదుపులోకి తీసుకున్నారు. దౌత్య ఒత్తిడితో ఆయన్ను మూడు రోజుల తర్వాత భారత్‌కు పాక్ అప్పగించిన విషయం తెలిసిందే.

ఇక గూగుల్ రిలీజ్ చేసిన జాబితాలో రెండో స్థానంలో ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఉండగా, క్రికెటర్ యువరాజ్ సింగ్ మూడోస్థానానికి పరిమితయ్యాడు. ఇక మూడోస్థానంలో ప్రముఖ మేథమెటేషియన్ ఆనంద్ కుమార్ నాలుగో స్థానంలో నిలిచారు. ఆనంద్ కుమార్ జీవితకథ ఆధారంగా బాలీవుడ్ లో సూపర్ 30సినిమా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో హృతిక్ రోషన్ ఆనంద్ కుమార్ పాత్రలో నటించారు.

ఇక ఐదవ స్థానంలో బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ నిలవగా,ఆరో స్థానంలో యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ నలిచాడు. సోషల్ మీడియా ద్వారా గుర్తింపు తెచ్చుకున్న రాణు మండల్ ఏడో స్థానంలో ఉన్నారు. ఇక స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2 సినిమా ద్వారా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన నటి తారా సుతరియా ఎనిమిదవ స్థానంలో నిలిచింది. ఇక హిందీ బిగ్ బాగ్ 13 సీజన్ కంటెస్టెంట్ సిద్దార్థ్ శుక్లా 9వ స్థానంలో నిలవగా టాప్ 10 స్థానంలో హిందీ బిగ్ 13 సీజన్ లో పాల్గొన్న కోయినా మిత్రా నిలిచారు.