Supreme Court: అత్యాచార బాధితురాలు ఫిర్యాదుపై విచారణ లేకుండా చార్జిషీటు ఫైల్ చేయొద్దు

  • Published By: nagamani ,Published On : October 9, 2020 / 01:49 PM IST
Supreme Court: అత్యాచార బాధితురాలు ఫిర్యాదుపై విచారణ లేకుండా చార్జిషీటు ఫైల్ చేయొద్దు

rape Case :అత్యాచార కేసులలోను.. కేసులలోను..లైంగిక వేధింపుల కేసుల్లోను సదరు బాధితుల ఫిర్యాదు ఆధారంగా నిందితులపై చార్జిషీటు ఫైల్ చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. తగిన విచారణ చేపట్టిన తర్వాత.. దానికి తగిన ఆధారాలు…సాక్ష్యాలు లభ్యమైతేనే సదరు నిందితులపై చార్జిషీటును నమోదుచేయాలని ఓ కేసు విషయంలో సుప్రీంకోర్టు ఈ సంచలన ఆదేశాలను జారీ చేసింది. కొన్ని ఫేక్ కేసుల విషయంలో కొంతమంది ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రమంలోను..ఇటువంటి కేసులు పెండింగ్ లో ఉండిపోవటం నిజమైన బాధితులకు న్యాయం జరగటంలేదనే ఉద్ధేశ్యంతో సుప్రీంకోర్టు ఇటువంటి ఆదేశాలు జారీచేసినట్లుగా తెలుస్తోంది.


దేశంలో ప్రతీ రోజు 87 నుంచి 90 అత్యాచారాలు జరుగుతున్నాయని తాజా గణాంకాలు వెల్లడించాయి. దేశంలో ప్రతీరోజు నిత్యం ఏదో ఓ చోట..అత్యాచారాలు..లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. అయితే కొంతమంది మాత్రం అత్యాచారాలకు గురికాకున్నా.. నిందితులపై కేసులు పెడుతున్నారు. వారిని పలు విధాలుగా బ్లాక్ మెయిల్ చేస్తూ.. ఏకంగా వారిపై చార్జిషీట్ లు కూడా ఫైల్ అవుతున్నాయి.


పోలీస్ స్టేషన్లలో రోజూవారీగా పలు సివిల్స్ కేసులు..ఫేక్ కేసులతో పాటు ఇటువంటి కేసులు కూడా పెరగడంతో పోలీసులకు ఇది పెద్ద తలనొప్పిగా తయారయ్యాయి. ఈ విషయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ఒక పిటిషన్ పై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. అత్యాచార బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా నిందితులపై చార్జిషీటు దాఖలు చేయరాదని పోలీసులకు ఆదేశించింది.


పూర్తి వివరాల్లోకి వెళితే..అత్యాచారానికి గురైన బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నిందితులపై చార్జిషీటు చేయరాదని, తగిన విచారణ చేపట్టిన తర్వాత.. దానికి తగిన ఆధారాలు లభ్యమైతేనే ఆరోపణలు ఎదుర్కొనేవారిపై చార్జిషీటును నమోదుచేయాలని..జస్టిస్ యు యు లలిత్, వినీత్ శరణ్, ఎస్ రవీంద్ర భట్ ల త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. జస్టిస్ లలిత్, వినీత్ శరణ్, ఎస్ రవీంద్ర భట్ ల త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది.


ఉత్తరప్రదేశ్ కు చెందిన బీజేపీ నాయకుడు..కేంద్ర మాజీ మంత్రి చిన్మయానంద్ పై లైంగికదాడి ఆరోపణల నేపథ్యంలో పోలీసులు.. ఫిర్యాదుదారు ఫిర్యాదు ఆధారంగా ఛార్జిషీటు ఫైల్ చేశారు. యూపీలో ఒక ఆశ్రమం నడుపుతున్న చిన్మయానంద ఆశ్రమంలో ఉంటున్న పలువురిని లైంగికంగా వేధించాడని ఓ యువతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదుచేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో చిన్మయానంద స్పందిస్తూ.. యువతి తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నదనీ, రూ. 5 కోట్ల దాకా డబ్బులు డిమాండ్ చేస్తున్నదని ఆరోపించారు.


ఈ కేసులో తీర్పు సందర్భంగా సుప్రీం ధర్మాసనం స్పందిస్తూ.. నిందతుడిపై ఆధారాలు లేకుండా ఐపీసీ సెక్షన్ 164 కింద చార్జిషీటు దాఖలు చేయడానికి వీల్లేదనీ..కేసుకు సంబంధించి తగిన విచారణ చేపట్టి.. అందుకు తగిన సాక్ష్యాధారాలు ఉంటేనే చార్జిషీట్ ఫైల్ చేయాలని ఆదేశించింది.


హత్రాస్ గ్యాంగ్ రేప్ మాదిరిగానే.. పలు అత్యాచార ఘటనల్లో మీడియా కవరేజీ.. హడావుడి ఆధారంగా నిందితులపై విచారణ చేపట్టకుండానే వారిపై కేసులు పెడుతుండటం, చార్జిషీటు దాఖలు చేస్తున్నారు. కాగా, చిన్మయానంద కేసుకు సంబంధించి కూడా.. ఈ కేసులో చిన్నయానంద ఆరోపిస్తున్నట్టు బాధితురాలు డబ్బును డిమాండ్ చేయడంపైనా విచారణ చేయాలని ఆదేశించింది. ఈ రెండు కేసులు అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో జరగాలని ఆదేశించింది.