Girl Gang Rape : గ్యాంగ్‌ రేప్‌ వల్ల గర్భం దాల్చి బాబుకు జన్మనిచ్చిన బాలిక..డీఎన్‌ఏ టెస్ట్‌ ద్వారా తండ్రిని తెలుసుకున్న కొడుకు

ఉత్తర ప్రదేశ్ లో గ్యాంగ్ రేప్ కు గురైన ఓ బాలిక గర్భం దాల్చింది. బాలిక మగ బిడ్డకు జన్మనిచ్చింది. పదేళ్ల తర్వాత డీఎన్ ఏ టెస్టు ద్వారా బాలుడు తన తండ్రి ఎవరో కొనుగొన్నారు. ఒక బాలికపై సామూహిక లైంగిక దాడి జరిగింది. దీంతో గర్భం దాల్చిన ఆమె బాబుకు జన్మనిచ్చింది. అయితే బాలిక తల్లీదండ్రులు ఆ బాబును ఒక కుటుంబానికి ఇచ్చారు.

Girl Gang Rape : గ్యాంగ్‌ రేప్‌ వల్ల గర్భం దాల్చి బాబుకు జన్మనిచ్చిన బాలిక..డీఎన్‌ఏ టెస్ట్‌ ద్వారా తండ్రిని తెలుసుకున్న కొడుకు

Girl Gang Rape : ఉత్తర ప్రదేశ్ లో గ్యాంగ్ రేప్ కు గురైన ఓ బాలిక గర్భం దాల్చింది. బాలిక మగ బిడ్డకు జన్మనిచ్చింది. పదేళ్ల తర్వాత డీఎన్ ఏ టెస్టు ద్వారా బాలుడు తన తండ్రి ఎవరో కొనుగొన్నారు. ఒక బాలికపై సామూహిక లైంగిక దాడి జరిగింది. దీంతో గర్భం దాల్చిన ఆమె బాబుకు జన్మనిచ్చింది. అయితే బాలిక తల్లీదండ్రులు ఆ బాబును ఒక కుటుంబానికి ఇచ్చారు.

తల్లీదండ్రులు ఆమెకు వెంటనే పెళ్లి చేశారు. కాగా, పదేళ్ల తర్వాత భార్యపై జరిగిన గ్యాంగ్‌ రేప్‌ సంగతి తెలిసిన భర్త ఆమెకు విడాకులు ఇచ్చారు. ఇదిలావుండగా, తన తల్లి గురించి తెలుసుకున్న కుమారుడు అసలైన తండ్రి కోసం కోర్టును ఆశ్రయించారు. దీంతో గ్యాంగ్‌ రేప్‌ నిందితుల్లో ఒకరిని అతడి తండ్రిగా డీఎన్‌ఏ టెస్ట్‌లో తేలింది.

Gujarat : బాలికపై గ్యాంగ్ రేప్..9మంది అరెస్ట్

1994లో షాజహాన్‌పూర్ జిల్లాకు చెందిన బాలిక (12) తన అక్కాబావ ఇంట్లో నివసించారు. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉండే కొందరు యువకులు ఆ ఇంట్లోకి చొరబడి ఒంటరిగా ఉన్న బాలికపై సామూహిక అత్యాచారం చేశారు. దీంతో ఆమె గర్భం దాల్చింది. 13 ఏళ్ల వయసులో మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆమె తల్లిదండ్రులు ఆ బాబును ఒక కుటుంబానికి ఇచ్చారు. ఆ కుటుంబం రాంపూర్‌కు వలస పోయింది.

అనంతరం బాలిక తల్లిదండ్రులు ఆమెకు ఒక వ్యక్తితో పెళ్లి చేశారు. అయితే పదేళ్ల తర్వాత భార్యపై గతంలో గ్యాంగ్‌ రేప్‌ జరిగిన విషయం భర్తకు తెలిసింది. దీంతో భార్యకు అతను విడాకులు ఇచ్చారు. మరోవైపు పెరిగి పెద్దవాడైన ఆ మహిళ కుమారుడు ఆమెను కలుసుకున్నారు. తన తండ్రి ఎవరని అడిగారు. జరిగిన సంగతి ఆ తల్లి చెప్పారు.

Girl Gangraped : బర్త్ డే పార్టీకి పిలిచి బాలికపై గ్యాంగ్ రేప్.. ఫ్రెండ్స్‌తో కలిసి బాయ్ ఫ్రెండ్ ఘాతుకం

దీంతో తన తండ్రి ఎవరన్నది అతడు తెలుసుకోవాలనుకున్నారు. దీనిపై కోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై విచారణ జరుపడంతో గ్యాంగ్‌ రేప్‌ నిందితులను పోలీసులు గుర్తించారు. వారికి డీఎన్‌ఏ టెస్ట్‌ చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో నిందితుల్లో ఒకరైన 27 ఏళ్ల వ్యక్తి గుడ్డు తండ్రిగా తేలింది. ఈ నేపథ్యంలో పోలీసులు అతడిని అరెస్ట్‌ చేశారు.