Raped 27 Years Ago Woman Files Case : చెట్టంత ఎదిగిన కొడుకు నాన్న ఏడమ్మా? అని అడిగితే..ఆ తల్లి పని మీద బైటకెళ్లారనో..ఆఫీసుకెళ్లారనో చెబుతుంది. కానీ ఓ తల్లి మాత్రం కొడుకు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏం చెప్పాలో తెలీక కోర్టు మెట్లెక్కింది. తన కొడుకుకు తండ్రి ఎవరో తెలియజేయాల్సిన బాధ్యత కోసమో..లేదా మరోదానికి కోసమో కాదు.. 27 ఏళ్ల క్రితం తనకు 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తనమీద అత్యాచారం చేసినవారిపై కేసు వేసినందుకు..!!
27 ఏళ్ల కొడుకు అడిగిన ప్రశ్నకు నాకు లోకమంటే ఏంటో తెలియని వయస్సులో ఇద్దరు మృగాళ్లు నామీద అత్యాచారం చేసిన దారుణానికి ప్రతిఫలంగా నువ్వు నాకు కొడుకువయ్యామని చెప్పలేకపోయింది. మనస్సులో గత 27ఏళ్లగా మరుగుతున్న ఆ దారుణ ఘటనతో మానసిక వేదనతో తల్లడిల్లిపోయిన ఆమెకు కొడుకు వేసిన ప్రశ్నకు సమాదానం చెప్పలేని స్థితిలో న్యాయస్థానం తలుపులు తట్టిందా తల్లి..! ఇన్నాళ్లకు ధైర్యం చేసి..పోలీసులకు స్టేషన్ మెట్లెక్కింది. కానీ పోలీసులు పట్టించుకోకపోవటంతో పోలీసులు పట్టించుకోకపోవడంతో కోర్టు మెట్లెక్కింది…!! అచ్చు సినిమా స్టోరీలాగా ఉన్న ఇది కథ కానే కాదు అచ్చంగా జరిగిన వాస్తవా గాథ ఉత్తరప్రదేశ్ లో జరిగింది..!!
కోర్టు మెట్లెక్కిన ఆ అభాగ్యురాలి ఆవేదన అర్థం చేసుకున్న న్యాయస్థానం ఆ ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేయమని ఆదేశించింది. దీంతో పోలీసులు ఆ ఇద్దరిపై 27 ఏళ్ల తరువాత కేసు నమోదు చేశారు. యూపీలోని షాజహాన్ పూర్ జిల్లాలోని సదర్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
రీల్ లైఫ్ లాంటి ఈ స్టోరీ గురించి జిల్లా ఎస్పీ సంజయ్ కుమార్ తెలిపిన వివరాలు..షాజహాన్ పూర్ లో 27 ఏళ్ల కిందట బాధితురాలు తన అక్క, బావతో కలిసి ఉండేది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవటాన్ని గమనించిన ఇద్దరు వ్యక్తులు వాళ్ల ఇంటిలోకి చొరబడ్డారు. స్థానికంగా నివసించే నాకీ హసన్ అనే వ్యక్తి, అతడి తమ్ముడు గుడ్డూ ఇద్దరూ ఆమెపై అత్యాచారం చేశారు. ఈ విషయం మీ అక్కాబావలకు గానీ ఇంకెవరికైనా చెబితే నిన్నూ..వారిని కూడా చంపేస్తామని బెదిరించారు. దీంతో ఆమె మౌనంగా ఉండిపోయింది. దాన్ని అలుసుగా తీసుకున్ని ఆ ఇద్దరూ ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు.
ఆ అఘాయిత్యానికి ఫలితంగా ఆమె గర్భందాల్చింది. 1994లో ఆమె 13 ఏళ్ల వయస్సులో ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బాబును పెంచే పరిస్థితి లేక..ఆ బిడ్డను తన సొంతూరు ఉధంపూర్ కు చెందిన ఓ వ్యక్తికి ఇచ్చింది. ఆ తర్వాత బావకు రాంపూర్ కు బదిలీ కావడంలో వారితో పాటే ఆమెకూడా అక్కడకు వెళ్లిపోయింది. ఆ తరువాత ఆమె అక్కా బావలు ఘాజీపూర్ కు చెందిన వ్యక్తితో ఆమెకు వివాహం చేశారు. ఆ తరువాత 10ఏళ్ల పాటు వారి సంసారం బాగానే సాగింది. కానీ ఆమెకు తనతో పెళ్లికాకముందు అత్యాచారానికి గురైందని తెలిసిన భర్త వదిలేశాడు. అలా ఆమె తిరిగి ఉదంపూర్ కు చేరుకుంది. కొన్నేళ్లు గడిచిపోయాయి.
అప్పటికే అత్యాచారానికి ఫలితంగా పుట్టిన పిల్లాడు పెరిగి పెద్దయ్యాడు. అమ్మానాన్నల గురించి అడిగాడు. పెంచిన వ్యక్తి తల్లి పేరును చెప్పాడు. దీంతో తన తల్లిని వెతుక్కుంటూ వచ్చిన అతను..తల్లిని చూశాను..మరి మా నాన్న ఎవరు? ఎక్కడుంటాడు? ఏం చేస్తుంటాడు?నన్ను ఎందుకు వేరే వారికి ఇచ్చేశావు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. దీనికి ఆ తల్లి సమాధానం ఏం చెబుతుంది?
దీంతో జరిగిన విషయం చెప్పింది. కొడుకు సహాయంతో శుక్రవారం (మార్చి 5,2021) సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదును పోలీసులు పట్టించుకోలేదు. దీంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించగా..సదరు నిందితులపై కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో ప్రవేశపెట్టాలని ధర్మాసం ఆదేశాల మేరకు పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేసారు. అనంతరం సదరు నిందితుల కోసంగాలిస్తున్నారు.
ఈ కేసు గురించి షాజహాన్ పూర్ జిల్లా ఎస్పీ సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. శుక్రవారం సాయంత్రం, ఆమె ఫిర్యాదు ఆధారంగా సదర్ బజార్ పోలీస్ స్టేషన్లో ఇద్దరు నిందితులపై సామూహిక అత్యాచారం కేసు నమోదు చేశామని కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.