2 heads 3 eyes calf born : 2 తలలు,3 కళ్లతో పుట్టిన ఆవు దూడ..అమ్మవారి అవతారమంటూ పూజలు

ఓరైతు ఆవు రెండు తలలు,మూడు కళ్లతో ఉన్న దూడకు జన్మనిచ్చింది.దసరా నవరాత్రుల్లో పుట్టిందని ఆ ఆవుదూడ అమ్మవారి అవతారం అంటూ స్థానికులు పూజలు చేస్తున్నారు.

2 heads 3 eyes calf born : 2 తలలు,3 కళ్లతో పుట్టిన ఆవు దూడ..అమ్మవారి అవతారమంటూ పూజలు

2 Heads 3 Eyes Calf Born

calf born with 2 heads 3 eyes : ఒడిశాలోని నబరంగపూర్ జిల్లాలో ఓ ఆవు ప్రసవించింది. పుట్టిన లేగదూడ వింతగా రెండు తలలు, మూడు కళ్లతో పుట్టింది. దసరా పండుగ పర్వదినాల్లో ఇటువంటి దూడ పుట్టటంతో ఆ ఆవు దూడను సాక్షాత్తు దుర్గామాత అమ్మవారిగా భావిస్తున్నారు ప్రజలు. దీంతో అమ్మవారే మమ్మల్ని కరుణించటానికి వచ్చిదంటూ ఆ ఆవుదూడకు పూజలు చేస్తున్నారు.

Read more : shortest cow Rani Died : ప్రపంచంలోనే అత్యంత పొట్టి ఆవు ‘రాణి’ మృతి

కుములి పంచాయతీలోని బీజాపూర్ గ్రామానికి చెందిన రైతు ధనిరామ్ అనే ఓ రైతు రెండేళ్ల క్రితం ఓ ఆవును కొన్నాడు. ఆ ఆవు గర్భం దాల్చి కొన్ని రోజుల క్రితం ఒక దూడను ఈనింది. ఈ దూడకు రెండు తలలు, మూడు కళ్లు ఉన్నాయి. దసరా నవరాత్రులల్లో పుట్టటం వల్ల ఆ పుట్టిన ఆవు దూడను దుర్గా మాత అవతారంగా గ్రామస్తులు భావించి పూజలు చేస్తున్నారు. ఈ వింత దూడను చూసేందుకు చుట్టు పక్కల గ్రామాల నుంచి కూడా జనాలు భారీగా తరలి వచ్చి ఆ ఆవుదూను చూసి ఆశ్చర్యపోతున్నారు.

Read more : http://Deep Dive Dubai : ప్ర‌పంచంలోనే అత్యంత లోతైన స్విమ్మింగ్ పూల్‌..స్కూబా డైవింగ్ కూడా చేయొచ్చు

జనాల గోల ఇలా ఉంటే పాపం రెండుతలలో తల్లి పాలు ఎలా తాగాలో తెలియక సతమతమవుతు ఆ బుల్లిదూడ నానా పాట్లు పడుతోంది. ఆవు కూడా దూడకు సరిగా పాలు ఇవ్వట్లేదని దీంతో తామే దూడకు పాలు పట్టిస్తున్నామని రైతు ధనిరామ్‌ తెలిపారు. జన్యు లోపం కారణంగా ఇలా రెండు తలలు, మూడు కళ్ల వంటి దూడలు జన్మిస్తాయని పశువైద్యులు చెబుతున్నారు. కాగా ఆ ఆవుదూడ కూడా పాపం..రెండు తలలు..మూడు కళ్లతో నడవటానికి..చాలా ఇబ్బంది పడుతోంది. తల్లికి కూడా దగ్గరకు రానివ్వకపోవటంతో యజమాని పట్టించే పాలే తాగుతోంది.దాని కష్టాలు దానికుంటే మరోపక్క ఎవరోవరో వచ్చి పూజలు పునస్కారాలు అంటూ ఇబ్బంది పెడుతుంటే పాపం ఆ ఆవుదూడ కష్టాలు ఏమని చెప్పాలి?