ఉరి ఎవరికి వేస్తారు? ఎందుకు వేస్తారు? మనదేశంలో ఎవరికి వేశారు?

  • Published By: vamsi ,Published On : March 20, 2020 / 12:54 AM IST
ఉరి ఎవరికి వేస్తారు? ఎందుకు వేస్తారు? మనదేశంలో ఎవరికి వేశారు?

ఎనిమిదేళ్ల కిందట.. దారుణ అత్యాచారానికి గురై.. కన్నుమూసిన నిర్భయకు ఎట్టకేలకు న్యాయం జరిగింది. ఆ దురాగతానికి పాల్పడిన దోషులకు చట్టపరంగా ఉరి శిక్ష వేశారు జైలు అధికారులు. నిర్భయ హత్య కేసులో దోషులకు ఉరిశిక్ష వెయ్యటంతో మరో సారి ఉరిశిక్ష అనే అంశం దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. అసలు భారత రాజ్యాంగం ఉరి శిక్ష గురించి ఏమి చెప్పింది ?
భారత దేశంలో ఎలాంటి కేసులుకి ఉరి శిక్ష వేస్తారు? ఉరి శిక్ష అమలులో ఎన్ని దశలు ఉన్నాయి?  గత 30 ఏళ్లలో మాన దేశంలో అమలైన ఉరి శిక్షలు ఏమిటి? అనే విషయాలు చర్చకు వచ్చింది.

భారత రాజ్యాంగం ఆర్టికల్ 21 ఈ దేశ పౌరులు అందరికి జీవించే హక్కు కల్పించింది. ఏ వ్యక్తిని హత్య చేయరాదు, ఏ వ్యక్తికి ఆత్మహత్య చేసుకునే హక్కు లేదు. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302 హత్య నేరం నిరూపణ అయితే నేరస్తులకు ఉరిశిక్ష విధిస్తుంది. మన దేశంలో ఉరి శిక్షని జిల్లా కోర్ట్ జడ్జ్ గాని, లేదా ప్రత్యేక న్యాయస్థానం జడ్జ్ గాని విధిస్తారు. ఒక వ్యక్తిని హత్య చేసిన , హత్యకి కుట్ర పన్నినట్టు తేలినా కూడా ఉరి శిక్ష విధిస్తారు 

1980 దశకము లో సుప్రీంకోర్టు ఒక కేసులో తీర్పు ఇస్తూ కేవలం ‘Rarest of rare’ అంటే అతి క్రూరమైన కేసుల్లో ఉరి శిక్ష వెయ్యాలి అని స్పష్లం చేసింది. జిల్లా న్యాయస్థానం, ప్రత్యేక న్యాయ స్తానం విధించిన ఉరి శిక్షని ఆ రాష్ట్ర హైకోర్టు ఆమోదించిన తర్వాతే ఉరి శిక్ష  అమలు చెయ్యాలి. హైకోర్టు ఉరిశిక్షని ఖరారు చేశాక నేరస్తులకు సుప్రీంకోర్టుకు వెళ్ళే హక్కు ఉంటుంది. సుప్రీంకోర్టు ఉరి శిక్ష ఖరారు చేశాక.. సుప్రీంకోర్టు తీర్పు మీద సమీక్ష కొరవచ్చు.(నిర్భయ డే : 2012 డిసెంబర్ 16..ఆ రోజు ఏం జరిగిందంటే ?)

సుప్రీంకోర్టు తీర్పు మీద క్యూరేటివ్ పిటీషన్ వెయ్యచ్చు. క్యూరేటివ్ పిటిషన్ నేరస్తుడి తరపున అతని సమీప బంధువు కానీ, అతనే నేరుగా కానీ వేసుకోవచ్చు. రాష్ట్ర పతి లేదా గవర్నెర్‌కి క్షమాభిక్ష దరఖాస్తు చేయవచ్చు. క్షమాభిక్ష దరఖాస్తును నేరస్తుడి తరపున అతని భార్య లేదా తల్లి అభ్యర్దించవచ్చు లేదా నేరస్తుడు స్వయంగా అభ్యర్దించవచ్చు. సమీక్ష పిటిషన్ , క్షమాభిక్షల పిటిషన్‌లు తిరస్కరించిన తరువాతే ఉరి శిక్ష అమలు అవుతుంది. 

స్వాతంత్ర భారత దేశంలో మొదటి ఉరి శిక్ష మహాత్మ గాంధీని చంపిన నాధురం గాడ్సేకి వేశారు. ఈ కేసులో కుట్రదారుడు నారాయణ్ ఆప్టేకి కూడా విధించారు. తర్వాత 1989 జనవరిలో ఇందిరా గాంధీని హత్య చేసిన సత్వన్త్ సింగ్, కెహార్ సింగ్‌కి ఉరి శిక్ష విధించారు. ఈ కేసును రామ్ జెట్మలాని వాదించగా.. తీహార్ జైలు లో ఉరి అమలు చేశారు. 1995లో తమిళనాడు లో ఆటో శంకర్ ని ఉరి తీశారు. 2004 లో ధనుంజయ్ చటర్జీని కలకత్తాలో ఉరి తీశారు. పదేళ్ల బాలికను హత్య చేసిన సంఘటనలో ఈ శిక్ష పడింది.

2010 లో ముంబయి 26/11 కేసు నెరస్తుడు కసబ్ ని ఉరి తీశారు ఎర్ర వాడ జైలులో. 2013 లో పార్లమెంట్ మీద దాడి కేసులో కుట్ర దారుడు అఫ్జల్ గురుని ఉరి తీశారు తీహార్ జైలులో. 2015 లో 1993 ముంబయి బాంబు బ్లాస్ట్ కుట్రదారుడు యాకుబ్ మెమన్‌ను ఉరి తీశారు. ఐదేళ్ల తర్వాత ఇప్పుడు నిర్భయ రేపిస్టులకు ఉరి వేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1993లో చిలకలూరిపేట బస్ దహనం కేసులో నేరస్తులకి రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టారు.

విజయవాడ శారదా కాలేజీ విద్యార్థిని శ్రీ లక్ష్మీ హత్య కేసులో నెరస్తుడు మనోహర్ కి ప్రత్యేక న్యాయస్థానం విధించిన ఉరి శిక్షని రాష్ట్ర హైకోర్టు యవజీవ శిక్షగా మార్చింది. మన రాష్ట్రంలో రాజమండ్రి సెంట్రల్ జైల్ లో మాత్రమే ఉరి శిక్ష అమలు చేసే అవకాశం ఉంది.