Rat In Meeting..Cake Eating : సీరియస్ మీటింగ్‌లోకి ఎలుక ఎంట్రీ .. కేక్ ముక్క భలే లాగించేసిందిగా..

Rat In Meeting..Cake Eating : సీరియస్ మీటింగ్‌లోకి ఎలుక ఎంట్రీ .. కేక్ ముక్క భలే లాగించేసిందిగా..

Rat 'attends' meeting and Enjoy eating a piece of cake viral video

Rat iN Meeting.. Cake Eating : ఓ సంస్థకు చెందిన కొంతమంది ఓ హాల్ లో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. టేబుల్ చుట్టూ సభ్యులు కూర్చున్నారు. ఈ సమావేశంలో సంస్థ యజమానో లేదా ఉన్నతాధికారో సీరియస్ గా మాట్లాడుతున్నారు. ఆ సమావేశం టేబుల్ పై ఫ్లవర్ బొకే పెట్టి ఉంది. దాని పక్కనే గెస్ట్ లకు పెట్టిన కేక్ ప్లేట్ ఉంది. మీటింగ్ లో వాడీ వేడీగా చర్చలు జరుగుతున్నాయి.

అందరూ సీరియస్‌గా ఏదో అంశంపై చర్చించుకుంటున్నారు. ఓ వ్యక్తి ఏదో అంశంపై మాట్లాడుతుండగా అక్కడున్నవారు శ్రద్ధగా వింటున్నారు. ఈ క్రమంలోనే కెమెరాను జూమ్ చేసినప్పుడు..వీరి సమావేశానికి అనుకోని అతిథి ఒకరు హాజరైంది. దాన్ని వారు ఏమాత్రం గమనించలేదు. వారి బిజీ డిస్కర్షన్ లో వారు ఉన్నారు.

మీటింగ్‌ మెయిన్‌ చైర్‌లో కూర్చుని ఉన్న ఓ వ్యక్తి ముందర పుష్ప గుచ్చం పెట్టి ఉంది. ఆ పక్కనే ప్లేట్‌లో ఒక కేక్‌ ముక్క కూడా..అక్కడే నక్కి ఉంది ఆ అనుకోని అతిథి..ఇంతకీ ఎవరంటే ఒక చిన్న ఎలుక..ఎవరూ పిలవకుండానే ఈ మిటింగ్ కు వచ్చింది. అక్కడి ఉద్యోగుల సమావేశం కోసం వేసిన టేబుల్‌పై ఉంచిన కేక్ ముక్కను గుటుక్కు గుటుక్కున మింగేస్తూ కనిపిస్తుంది. వారి వారి చర్చల్లో సభ్యలు బిజీగా ఉంటే ఈ ఎలుక మాత్రం దాని పని అది కామ్ గా కానిచ్చేసింది. చక్కగా కేకు ముక్కను లటుకు లటుక్కుమని తినేసింది. ఈ క్లిప్‌ను ఆరిఫ్ ఖవాజా అనే వినియోగదారు ట్విట్టర్‌లో షేర్ చేసిన  ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎవ్వరు పిలవకుండా వచ్చిన ప్రత్యేక అతిథికి కేకు ముక్క భలే దొరికిందే అంటున్నారు నెటిజన్లు.

Rat ‘attends’ meeting and Enjoy cake eating a piece of cake viral video