Ratan Tata : వీధి కుక్కకు గొడుగు పట్టాడు, రతన్ టాటా మనసు గెలిచాడు

ఈ రోజుల్లో తోటి మనిషిని పట్టించుకోవడమే కష్టమైపోయింది. ఎవడు ఎలా పోతే ఏంటి.. నాకెందుకు... నేను బాగుంటే చాలు అనే స్వార్థం మనిషిలో పెరిగిపోయింది. సాటి మనిషి కష్టాల్లో లేదా ఇబ్బందుల్లో

Ratan Tata : వీధి కుక్కకు గొడుగు పట్టాడు, రతన్ టాటా మనసు గెలిచాడు

Ratan Tata

Ratan Tata : ఈ రోజుల్లో తోటి మనిషిని పట్టించుకోవడమే కష్టమైపోయింది. ఎవడు ఎలా పోతే ఏంటి.. నాకెందుకు… నేను బాగుంటే చాలు అనే స్వార్థం మనిషిలో పెరిగిపోయింది. సాటి మనిషి కష్టాల్లో లేదా ఇబ్బందుల్లో ఉన్నా సాయం చేసే వారు చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటిది మూగజీవాల గురించి పట్టించుకునే వారు చాలా అరుదుగా కనిపిస్తారు. వారు మూగజీవాలను కూడా తోటి మనుషుల్లానే చూస్తారు. వాటి పట్ల జాలి చూపుతారు. తాజ్ హోటల్ కి చెందిన ఓ ఉద్యోగి ఈ కోవకే వస్తాడు. ఆ ఉద్యోగి చేసిన పని ఏకంగా బిజినెస్ టైకూన్ రతన్ టాటా మనసును గెలిచింది. ఆ ఉద్యోగికి స్వయంగా రతన్ టాటా అభినందనలు తెలిపారు. ఇంతకీ ఆ ఉద్యోగి ఏం చేశాడో తెలుసా? వానలో తడవకుండా కుక్కకి గొడుగు పట్టాడు.

Hybrid Flying Car : ఎగిరిపోతే ఎంత బాగుంటుంది.. ఫ్ల‌యింగ్ కారు వచ్చేస్తోంది, మేడిన్ ఇండియా

ర‌త‌న్ టాటాకు పెట్స్ అంటే చాలా ఇష్టం. ఆయ‌న ద‌గ్గ‌ర చాలా పెంపుడు జంతువులు ఉంటాయి. సోష‌ల్ మీడియాలో తాజాగా వైర‌ల్ అవుతున్న ఓ ఫోటో ర‌త‌న్ టాటా దృష్టికి వచ్చింది. అది దేని గురించి అంటే.. ముంబైలోని తాజ్ హోట‌ల్‌లో ప‌నిచేసే ఓ ఉద్యోగి.. వ‌ర్షానికి త‌డుస్తున్న ఓ వీధికుక్క‌కు త‌డ‌వ‌కుండా గొడుగు ప‌డ‌తాడు. ఆ ఫోటోను చూసి ర‌త‌న్ టాటా ఫిదా అయ్యారు.

Malware ముప్పు.. బ్యాంకు యూజర్లకు వార్నింగ్, క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ

ఆ ఫోటోను త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసిన టాటా.. ఇది చాలా బెస్ట్ మూమెంట్. వీధికుక్క‌ల‌కు తోచినంత సాయం చేయ‌డం అనేది గొప్ప ప‌ని. తాజ్ ఉద్యోగి చేసిన ప‌నిని నేను అభినందిస్తున్నా.. అని అన్నారు.