Girl Child: అమ్మాయి పుట్టింది.. ఆసుపత్రి నుంచి ఇంటికి రథం ఊరేగింది

లింగ సమానత్వంలో చాలా ముందుకు వచ్చినప్పటికీ.. కావాల్సినంత సమానత్వం ఇంకా రాలేదు. ఆడపిల్ల పుట్టగానే హతమార్చే రోజులైతే పోయాయి కానీ, ఆడపిల్ల పుట్టిందా అనే అసంతృప్తులు అయితే నేటికీ చాలానే ఉన్నారు. అయితే పంజాబ్‭లో ఓ కుటుంబం మాత్రం దీనికి పూర్తి విరుద్ధంగా ప్రవర్తించింది. వారి ఇంట్లో అమ్మాయి పుట్టడమే పెద్ద పండగ అన్నట్లుగా వ్యవహరించింది

Girl Child: అమ్మాయి పుట్టింది.. ఆసుపత్రి నుంచి ఇంటికి రథం ఊరేగింది

rath rally for birth of a girl child in punjab

Girl Child: లింగ సమానత్వంలో చాలా ముందుకు వచ్చినప్పటికీ.. కావాల్సినంత సమానత్వం ఇంకా రాలేదు. ఆడపిల్ల పుట్టగానే హతమార్చే రోజులైతే పోయాయి కానీ, ఆడపిల్ల పుట్టిందా అనే అసంతృప్తులు అయితే నేటికీ చాలానే ఉన్నారు. అయితే పంజాబ్‭లో ఓ కుటుంబం మాత్రం దీనికి పూర్తి విరుద్ధంగా ప్రవర్తించింది. వారి ఇంట్లో అమ్మాయి పుట్టడమే పెద్ద పండగ అన్నట్లుగా వ్యవహరించింది. ఏకంగా రథం తీసుకువచ్చి ఆ చిన్నారిని ఊరంతా తిప్పింది. ఆసుపత్రి నుంచి ఇంటి వరకు జోరుగా, పండగలా తీసుకువచ్చింది. పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‭సర్‭కు చెందిన సాగర్, జాన్వి అనే దంపతులకు రెండ్రోజుల క్రితం అమ్మాయి పుట్టింది. అనంతరం, కుటుంబ సభ్యులంతా కలిసి ఆసుపత్రి నుంచి ఇంటి వరకు తల్లిని చిన్నారిని రథంపై ఊరేగిస్తూ ఇంటికి తీసుకువచ్చారు. రోడ్డంతా జన సందోహంతో బ్యాండు బాజాలతో మారుమోగిపోయింది. ఈ విషయమై కుటుంబ సభ్యులు స్పందిస్తూ ఆడపిల్లను తాము మహాలక్ష్మి అని భావిస్తామని, తాము భావించినట్టుగానే అమ్మాయి పుట్టడం తమకు పెద్ద పండగలా మారిందని అన్నారు.

India-China Clash: 37 వేల చ.కి.మీ ప్రాంతాన్ని చైనా ఆక్రమించినప్పుడు మీ తాత నిద్రపోతున్నారా? రాహుల్ గాంధీకి బీజేపీ కౌంటర్