రేషన్ కార్డుదారులకు కేంద్రం గుడ్ న్యూస్, ఈ నెంబర్‌కు ఫిర్యాదు చేస్తే చాలు

రేషన్ కార్డుదారులకు కేంద్రం గుడ్ న్యూస్, ఈ నెంబర్‌కు ఫిర్యాదు చేస్తే చాలు

Ration Card Complaint Helpline Numbers: రేషన్ కార్డుదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. రేషన్ విషయంలో ఏవైనా ఇబ్బందులు, సమస్యలు ఉంటే.. ఇక ఆందోళన చెందాల్సిన పని లేదు. ఎవరి చుట్టూ తిరగాల్సిన బాధ లేదు. మీరు మీ సమస్యను ప్రభుత్వానికి తెలియజేసి ఇట్టే పరిష్కరించుకోవచ్చు. అదీ కూడా ఇంట్లోనే ఉండి.

రేషన్ డీలర్లు రేషన్ సరుకులు ఇవ్వకపోయినా, లేదంటే తక్కువ ఇస్తున్నా.. ఎక్కువ డబ్బు తీసుకుంటున్నా.. మీరు ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ పోర్టల్ NFSA ఒక్కో రాష్ట్రానికి ఒక్కో నెంబర్ కేటాయించింది. రాష్ట్రం ప్రాతిపదికన కాల్ చేయాల్సిన నెంబర్లు మారిపోతాయి.

మీరు https://nfsa.gov.in వెబ్‌సైట్‌కు వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ వెబ్‌సైట్‌లోని మెయిల్ లేదా ఫోన్ నెంబర్ల ద్వారా ఫిర్యాదులు చేయవచ్చు. వెబ్‌సైట్ ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చు. ప్రతి రాష్ట్రానికి సెపరేట్ టోల్ ఫ్రీ నంబర్ ఉంటుంది.

ఏపీ రేషన్ కార్డు కలిగి ఉన్నట్లయితే.. 1800-425-2977 నెంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. అదే తెలంగాణలో రేషన్ కార్డు కలిగి ఉన్నట్లయితే 1800-4250-0333 నెంబర్‌కు కాల్ చేయాల్సి ఉంటుంది.

రాష్ట్రాల వారీగా ఫిర్యాదు హెల్ప్‌లైన్ నెంబర్లు:
ఆంధ్రప్రదేశ్ – 1800-425-2977
తెలంగాణ – 1800-4250-0333
అరుణాచల్ ప్రదేశ్ – 03602244290
అస్సాం – 1800-345-3611
బీహార్-1800 – 3456-194
ఛత్తీస్‌ఘడ్- 1800-233-3663
గోవా- 1800-233-0022
గుజరాత్- 1800-233-5500
హర్యానా – 1800-180-2087
హిమాచల్ ప్రదేశ్ – 1800-180-8026
జార్ఖండ్ – 1800-345-6598, 1800-212-5512
కర్ణాటక- 1800-425-9339
కేరళ- 1800-425-1550
మధ్యప్రదేశ్- 181
మహారాష్ట్ర- 1800-22-4950
మణిపూర్-1800-345-3821
మేఘాలయ – 1800-345-3670
మిజోరం – 1860-222-222-789, 1800-345-3891
నాగాలాండ్ – 1800-345-3704, 1800-345-3705
ఒడిశా – 1800-345-6724 / 6760
పంజాబ్ – 1800-3006- 1313
రాజస్థాన్ – 1800-180-6127
సిక్కిం – 1800-345-3236
తమిళనాడు – 1800-425-5901
త్రిపుర – 1800-345-3665
ఉత్తర ప్రదేశ్- 1800-180-0150
ఉత్తరాఖండ్ – 1800-180-2000, 1800-180-4188
పశ్చిమ బెంగాల్ – 1800-345-5505
ఢిల్లీ – 1800-110-841
జమ్మూ – 1800-180-7106
కాశ్మీర్ – 1800–180–7011
అండమాన్, నికోబార్ దీవులు – 1800–343–3197
చండీగర్- 1800–180–2068
దాద్రా నగర్ హవేలీ, డామన్ డియు – 1800-233-4004
లక్షద్వీప్ – 1800-425-3186
పుదుచ్చేరి – 1800-425-1082

రేషన్ కార్డు ద్వారా గోధుమలు, బియ్యం, పంచదార మొదలైన నిత్యవసరాలను తక్కువ ధరకే రేషన్ దుకాణాల ద్వారా పేద వర్గాలకు ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. కాగా రేషన్ పంపిణీపై పెద్దఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ క్రమంలో అవినీతిని అరికట్టేందుకు, ఆహార ధాన్యాల పంపిణీని సక్రమంగా నిర్వర్తించడానికి కేంద్ర ప్రభుత్వం ఫిర్యాదు హెల్ప్‌లైన్ నంబర్లను ప్రవేశపెట్టింది. దీని ద్వారా అర్హులైన పేదలకు సక్రమంగా రేషన్ పంపిణీ చేయవచ్చన్నది ప్రభుత్వం భావన.