Ration card: ఆధార్ నంబర్ ఇవ్వకపోతే రేషన్ కార్డు తొలగింపు

రేషన్‌కార్డు పొందేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొనే సమయంలో కుటుంబ పెద్ద, సభ్యులు అని ప్రతి ఒక్కరి ఆధార్‌ నెంబర్లు అప్‌లోడ్‌ చేయాలి. ఐదేళ్లలోపున్న పిల్లలకు ఆధార్‌ ఉంటే ఆ నెంబరు అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. లేకపోతే జనన ధృవీకరణ పత్రం అప్‌లోడ్‌ చేయాలి

Aadhaar number: ప్రభుత్వ నియమాల్ని తెలుసుకోక పోవడం వల్ల కొంత మంది నష్టపోతున్నారు. ముఖ్యంగా ధ్రువపత్రాలు, వాటి పనితీరు గురించి చాలా మందికి అవగాహన ఉండదు. ఇలా తెలియక కొందరివి రేషన్ కార్డు నుంచి పేర్లు తొలగిపోతున్నారు. ఆధార్ నంబరు అనుసంధానం చేయకపోతే అధికారులు వారి పేర్లను రేషన్ కార్డు నుంచి తొలగిస్తున్నారు. ఇది ముఖ్యంగా చిన్న పిల్లల విషయంలో జరుగుతోంది. ఆధార్‌ నెంబరు సమర్పించని పిల్లల పేర్లను రేషన్‌కార్డుల నుంచి అధికారులు తొలగించారు.

రేషన్‌కార్డు పొందేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొనే సమయంలో కుటుంబ పెద్ద, సభ్యులు అని ప్రతి ఒక్కరి ఆధార్‌ నెంబర్లు అప్‌లోడ్‌ చేయాలి. ఐదేళ్లలోపున్న పిల్లలకు ఆధార్‌ ఉంటే ఆ నెంబరు అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. లేకపోతే జనన ధృవీకరణ పత్రం అప్‌లోడ్‌ చేయాలి. ఐదేళ్లకు పైగా ఉన్న వారు ఆధార్‌ నెంబరు తప్పని సరిగా నమోదు చేయాలి. అయితే పలువురు వారి పిల్లల నెంబర్లు నమోదు చేయడం లేదు. వారి జాబితా రేషన్‌ దుకాణాలకు పంపి ఆధార్‌ నెంబరు నమోదు చేయాలని ఉద్యోగులకు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆ వివరాలను ఉద్యోగులు కార్డుదారులకు తెలియజేయడం లేదు. అదే సమయంలో పలువురు పిల్లల పేర్లు కార్డు నుంచి అధికారులు తొలగించారు.

ట్రెండింగ్ వార్తలు