RBI KYC : బ్యాంకు ఖాతాదారులకు ఆర్బీఐ వార్నింగ్

సైబర్‌ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్త తరహాలో నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా కేవైసీ అప్‌డేట్‌ పేరుతో జేబులు గుల్ల చేస్తున్నారు. దీనిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)

RBI KYC : బ్యాంకు ఖాతాదారులకు ఆర్బీఐ వార్నింగ్

Rbi Kyc

RBI KYC : సైబర్‌ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్త తరహాలో నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా కేవైసీ అప్‌డేట్‌ పేరుతో జేబులు గుల్ల చేస్తున్నారు. దీనిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కి చాలా ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో బ్యాంకు వినియోగదారులను ఆర్బీఐ అలర్ట్ చేసింది. పలు సూచనలు ఇచ్చింది.

PF Transfer Online : మీ అకౌంట్‌ నుంచి డబ్బులు ఈజీగా ట్రాన్స్‌ఫర్‌ చేసుకోండిలా!

సైబర్‌ నేరగాళ్లు కస్టమర్లకు రకరకాల మెసేజ్‌లు సోషల్‌ మీడియాలో, మొబైళ్లకు పంపుతున్నారు. కేవైసీ చేయకపోతే 24 గంటల్లో మీ అకౌంట్‌ బ్లాక్‌ అవుతుందని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి మెసేజ్‌లను నమ్మొద్దని ఆర్బీఐ హెచ్చరిస్తోంది. కేవైసీ వివరాలు అప్‌డేట్ చేయకపోతే బ్యాంకింగ్ సేవలు పూర్తి స్థాయిలో పొందలేరని రకరకాల మెసేజ్ లు వైరల్ చేస్తున్నారు. అంతేకాదు అందుకు కస్టమర్‌ కేర్‌ నెంబర్‌ కూడా ఇస్తున్నారు. ఆ నెంబర్‌కు ఫోన్‌ చేస్తే మీరు నేరగాళ్లు ఉచ్చులో పడినట్లే. జాగ్రత్తగా ఉండాలంటూ ఆర్బీఐ సూచిస్తోంది.

Wrong Account : మీ డబ్బులు మరో అకౌంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేశారా? రీఫండ్ అవుతాయా? ప్రాసెస్ ఇదిగో!

ఖాతా లాగిన్ వివరాలు, వ్యక్తిగత సమాచారం, KYC పత్రాల కాపీలు, కార్డ్ సమాచారం, PIN నెంబర్, పాస్‌వర్డ్, OTP మొదలైన వాటిని అపరిచిత వ్యక్తులు, ఏజెన్సీలతో పంచుకోవద్దని హెచ్చరిస్తోంది. ఇంకా గుర్తింపు లేని వెబ్‌సైట్లు, అప్లికేషన్లను నమ్మవద్దంది. ఒకవేళ KYC అప్‌డేట్‌ చేయమని సందేశం వస్తే మీరు మొదటగా బ్యాంక్‌ని సంప్రదించమని చెబుతోంది. వాస్తవానికి కస్టమర్లకు ఫోన్‌ చేసి KYC అప్ డేట్ చేయాలని ఏ బ్యాంకు అడగదని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆర్బీఐ హెచ్చరించింది.