RBI Guidelines: ఐదు బ్యాంకులపై ఆర్‌బీఐ నిషేధం .. ఆ బ్యాంకుల్లో ఖాతాదారులు డబ్బును విత్ డ్రా చేయలేరు ..

ఆర్థిక పరిస్థితి క్షీణించడంతో దేశంలోని ఐదు సహకార బ్యాంకులను ఆర్‌బీఐ నిషేధించింది. ఆరు నెలల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది. అయితే, ఐదు బ్యాంకుల్లో మూడు బ్యాంకులపై డిపాజిట్ విత్‌డ్రాపై నిషేధం విధించగా, మిగిలిన రెండు బ్యాంకుల్లో రూ. 5వేలు వరకు విత్ డ్రా చేసుకోవచ్చు.

RBI Guidelines: ఐదు బ్యాంకులపై ఆర్‌బీఐ నిషేధం .. ఆ బ్యాంకుల్లో ఖాతాదారులు డబ్బును విత్ డ్రా చేయలేరు ..

RBI

RBI Guidelines: దేశంలోని కొన్ని సహకార బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) చర్యలు తీసుకుంది. వీటిల్లో కొన్ని బ్యాంకుల్లో ఖాతాదారులు నగదు విత్ డ్రా చేయటానికి వీలు కోల్పోతారు. మరికొన్ని బ్యాంకుల్లో రూ. 5వేలు వరకు మాత్రమే నగదు విత్ డ్రాకు అవకాశం ఉంటుంది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నిషేధించిన ఐదు సహకార బ్యాంకుల్లో ఏపీకి చెందిన ఓ బ్యాంకు కూడా ఉండటం విశేషం. ఆర్బీఐ విధించిన నిషేధం ఆరు నెలలు కొనసాగుతుంది.

RBI Hikes Repo Rate: సామాన్యులకు షాక్.. మరోసారి రెపో రేటు పెంచిన ఆర్‌బీఐ .. పెరగనున్న లోన్ ఈఎంఐలు

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నిషేధించిన బ్యాంకుల్లో హెచ్‌సీబీఎల్ కో- ఆపరేటివ్ బ్యాంక్ (లక్నో), ఆదర్శ్ మహిళా నగరి సహకారి బ్యాంక్ మర్వాడిట్ (ఔరంగాబాద్), షింషా కో- ఆపరేటివ్ బ్యాంక్ నియమిత ( కర్ణాటక), ఉరవకొండ కో- ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ (ఆంధ్రప్రదేశ్), శంకర్‌రావ్ మోహితే పాటిల్ సహకార బ్యాంక్ (మహారాష్ట్ర) బ్యాంకులు ఉన్నాయి. అయితే, ఉరవకొండ కో- ఆపరేటివ్ టౌన్ బ్యాంక్, శంకర్ రావ్ మోహితే పాటిల్ సహకార బ్యాంక్ కస్టమర్లు రూ. 5వేల వరకు విత్ డ్రా చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది. మిగిలిన నిషేధిత బ్యాంకుల్లో బ్యాంకుల ప్రస్తుత లిక్విడిటీ స్థితి కారణంగా ఖాతాదారులు తమ ఖాతాల నుండి డబ్బులను విత్ డ్రా చేయలేరు.

RBI New Guidelines : బంగారం దిగుమతులపై ఆర్‌బీఐ కొత్త రూల్స్.. వారికి మాత్రమేనట..!

ఈ ఐదు బ్యాంకులపై ఆర్‌బీఐ చర్యలు తీసుకునేందుకు పలు కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఐదు బ్యాంకుల ఆర్థిక పరిస్థితి క్షీణించడంతో ఆంక్షలు విధించింది. నిషేధం కారణంగా.. ఆర్‌బీఐ నుంచి ముందస్తు అనుమతి లేకుండా రుణాలు మంజూరు చేయడం, పెట్టుబడులు పెట్టడం, బ్యాంకు తరపున లావాదేవీల విషయంలో ఏదైనా బాధ్యత వహించడంపై నిషేధంతో పాటు ఆస్తుల విక్రయాలపై నిషేధం ఉంటుంది. అయితే, ఈ ఐదు సహకార బ్యాంకుల్లో అర్హత కలిగిన డిపాజిటర్లు డిపాజిట్ ఇన్సూరెన్స్ , క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ నుండి రూ. 5లక్షల వరకు డిపాజిట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ మొత్తాలను అందుకునే అవకాశం ఉంటుంది. ఇదిలాఉంటే ఇటీవల కొన్ని జాతీయ బ్యాంకులకు ఆర్బీఐ జరిమానా విధించిన విషయం విధితమే.