RBI : డిజిటల్ రూపీ ప్రీ పెయిడ్ వోచర్లు.. వడ్డీ రేట్లలో మార్పు లేదు

అంతర్జాతీయ పరిస్థితుల్లో ప్రతికూలతలు ఉన్నా రూపాయి విలువ స్థిరంగానే కొనసాగుతోందని, వంటల నూనెల దిగుమతి, క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల వల్ల విదేశీ మారక ద్రవ్యం నిల్వలు కొంత...

RBI : డిజిటల్ రూపీ ప్రీ పెయిడ్ వోచర్లు.. వడ్డీ రేట్లలో మార్పు లేదు

RBI

RBI Board Meeting : భారతీయ రిజర్వ్ బ్యాంకు కీలక నిర్ణయాలు తీసుకుంది. కీలక వడ్డీ రేట్లను మరోసారి యథాతథంగా కొనసాగించనున్నట్లు, డిజిటల్ రూపీని రూ. 10 వేల నుంచి లక్ష రూపాయల వరకు ప్రీ పెయిడ్ వోచర్లుగా ఆర్బీఐ జారీ చేస్తుందని రిజర్వ్ బ్యాంకు ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. దేశ జీడీపీ 7.8 శాతంగా ఉంటుందని, 2022-23 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 4.5 శాతానికి పరిమితం అవుతుందని, కరోనా ప్రభావదం నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకుందన్నారు. కమర్షియల్ బ్యాంకుల పని తీరు క్రమక్రమంగా మెరుగుపడుతోందన్నారు.

Read More : Hizab :హిజాబ్ వివాదంపై పాక్ విమర్శలు..మా సమస్యను మేం చూస్కుంటాం..మీరు నీతులు చెప్పక్కర్లా

2022, ఫిబ్రవరి 10వ తేదీన 14వ రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా బోర్డు సమావేశం జరిగింది. సమావేశం అనంతరం శక్తికాంత దాస్ మీడియాతో మాట్లాడారు. అంతర్జాతీయ పరిస్థితుల్లో ప్రతికూలతలు ఉన్నా రూపాయి విలువ స్థిరంగానే కొనసాగుతోందని, వంటల నూనెల దిగుమతి, క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల వల్ల విదేశీ మారక ద్రవ్యం నిల్వలు కొంత తగ్గాయన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు కూడా అందుబాటులో ఉంటాయని, పెట్రోల్ ధరలు పెరగకపోవడం వల్ల ధరల పెరుగుదలకు కొంత బ్రేక్ పడిందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

Read More : Parliament Session : మోదీపై టీఆర్ఎస్ సభాహక్కుల ఉల్లంఘన నోటీసు

కరోనా భయం పోయినందున ఎమర్జెన్సీ, హెల్త్ సర్వీసెస్, కాంటాక్టింగ్ ఇంటెన్సివ్ సర్వీసుల కోసం గత జులైలో రూ. 50 వేల కోట్లు కేటాయిస్తూ తీసుకొచ్చిన ఈ పథకం కొనసాగుతుందన్నారు. అధిక ద్రవ్యోల్బణం భయాల కారణంగా కీలక రేట్లలో మార్పులు చేయడం లేదన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 5.3 శాతం, 2022-23 ఆర్థిక సంవత్సరంలో 4.5 శాతం నమోదవుతుందని అంచనా వేయడం జరుగుతుందన్నారు. మొత్తంగా ప్రభుత్వ మార్కెట్ రుణ సమీకరణలు, ప్రణాళికలు, ద్రవ్యలోటు తదితర వాటిపై సుదీర్ఘంగా చర్చించారు.