RBI: క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు డెడ్‌లైన్ పొడిగించిన ఆర్బీఐ

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డ్ ఇష్యూ చేసేందుకు కొత్త గైడ్ లైన్స్ అక్టోబర్ 1 నుంచి అమలు చేసుకోవచ్చని మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ముందుగా డెడ్‌లైన్ జులై1గా ప్రకటించిన ఆర్బీఐ..

RBI: క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు డెడ్‌లైన్ పొడిగించిన ఆర్బీఐ

Debit Card Rules

 

 

RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డ్ ఇష్యూ చేసేందుకు కొత్త గైడ్ లైన్స్ అక్టోబర్ 1 నుంచి అమలు చేసుకోవచ్చని మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ముందుగా డెడ్‌లైన్ జులై1గా ప్రకటించిన ఆర్బీఐ.. పలు ఇండస్ట్రీ స్టేక్ హోల్డర్ల నుంచి వచ్చిన రిక్వెస్టులను పరిగణనలోకి తీసుకుని వాయిదా వేసినట్లు పేర్కొంది.

డెడ్‌లైన్ వాయిదా వేసేందుకు చాలా పలు కారణాలు కీలకమయ్యాయి. కస్టమర్ క్రెడిట్ కార్డును 30రోజుల లోపు యాక్టివేట్ చేయకపోతే, బ్యాంకులు లేదా కార్డ్ జారీ చేసిన యాజమాన్యం కస్టమర్ నుంచి వన్ టైమ్ పాస్ వర్డ్ తీసుకోవాలి. వినియోగదారుడు ఎటువంటి అప్రూవల్ ఇవ్వకపోతే అదనపు ఖర్చులు లేకుండా ఏడు పని దినాల్లోగా కార్డును మూసేయాలి.

క్రెడిట్ కార్డుపై క్రెడిట్ లిమిట్ పెంచేముందు తప్పనిసరిగా స్పష్టమైన అప్రూవల్ అడగాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డ్ బకాయిల చెల్లింపుకు సంబంధించిన నిబంధనలు, షరతులు స్పష్టంగా నిర్దేశించాలని ఆర్‌బీఐ తెలిపింది. “చెల్లించని ఛార్జీలు/పన్నులు వసూలు చేయడం/వడ్డీని కలపడం వంటివి క్యాపిటలైజ్ చేయడానికి వీల్లేదు” అని రెగ్యులేటర్ తెలిపింది.

Read Also: క్రెడిట్ కార్డులతో యూపీఐ పేమెంట్లకు ఆర్‌బీఐ అనుమతి