ఆర్‌బీఐ కీలక ప్రకటన: రేపో రేటు తగ్గింపు

  • Published By: vamsi ,Published On : March 27, 2020 / 05:15 AM IST
ఆర్‌బీఐ కీలక ప్రకటన: రేపో రేటు తగ్గింపు

కరోనా కారణంగా తలెత్తిన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే చర్యల్లో భాగంగా మూడవ రోజు లాక్‌డౌన్ కొనసాగుతుండగానే.. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్ నేతృత్వంలోని బృందం మీడియా సమావేశం ఏర్పాటు చేసి, లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న పేద, మధ్య తరగతి ప్రజలను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంది.

ఈ క్రమంలోనే రెపో రేటును తగ్గిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. రెపో రేటును 75శాతం బేసిస్ పాయింట్లకు తగ్గించి 4.40శాతానికి తీసుకొచ్చినట్లు చెప్పారు. రివర్స్ రెపో రేటును కూడా 90శాతం తగ్గించామని అన్నారు. ఆర్థిక స్థిరత్వం కోసమే ఈ చర్యలు తీసుకున్నట్లు శక్తికాంత దాస్ వెల్లడించారు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని ఆయన స్పష్టం చేశారు.

ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించే క్రమంలో భాగంగా ప్రధానంగా నాలుగు చర్యలు తీసుకోబోతున్నట్టు శక్తికాంత దాస్ తెలిపారు. కరోనా వైరస్‌ నియంత్రణకు ప్రణాళికలను సిద్దం చేయడం,మార్కెట్లలో లిక్కిడిటీ స్థిరత్వం, బ్యాంకుల రుణాల ప్రక్రియలో నిలకడ,చెల్లింపుల్లో సడలింపు చర్యలు, మార్కెట్ అస్థిరతను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

అలాగే ఈఎమ్‌ఐపై మూడు నెలల మోటోరియంను ప్రకటించింది ఆర్‌బీఐ.