RBI Governor : రూ.2000 వేల నోట్ మార్చుకోవడానికి తొందరపడొద్దు.. రూ.1000 నోట్ మళ్లీ ప్రవేశపెట్టే యోచన లేదు : ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్

రూ.2 వేల నోట్ చెలామణిలో ఉంటుందని, షాపులు ఆ నోట్లను తిరస్కరించరాదని పేర్కొన్నారు. కావాల్సినంత సమయం ఉన్న కారణంగా కస్టమర్లు బ్యాంకులకు పోటెత్తాల్సిన అవసరం లేదని చెప్పారు.

RBI Governor : రూ.2000 వేల నోట్ మార్చుకోవడానికి తొందరపడొద్దు.. రూ.1000 నోట్ మళ్లీ ప్రవేశపెట్టే యోచన లేదు : ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్

RBI Governor Shaktikanta Das

RBI Governor Shaktikanta Das : భారత ఆర్థిక వ్యవస్థ నుంచి రూ.2 వేల నోట్ ఉసంహరించుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించిన విషయం తెలిసిందే. రూ.2 వేల నోట్లు సెప్టెంబర్ 30వ తేదీ వరకు మాత్రమే చెలామణిలో ఉంటాయని, ఆ తర్వాత చెల్లుబాటు కానివిగా భావిస్తామని ఆర్బీఐ తెలిపింది. ఈ లోపు రూ.2 వేల నోట్లు ఉన్నవారు బ్యాంకుల్లో డిపాజిట్ చేయవచ్చని సూచించింది.

రూ.2 వేలు నోట్ మార్చుకోవడానికి తొందరపడవద్దని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. రూ.2 వేల నోట్ మార్పిడికి నాలుగు నెలల సమయం ఉందన్నారు. రూ.2 వేల నోట్ ను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన తొలిసారి సోమవారం ఆర్బీఐ గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ బ్యాంకుల వద్ద రద్దీ తగ్గించడానికి సెప్టెంబర్ వరకు గడువు ఇచ్చామని పేర్కొన్నారు. లావాదేవీలపై యాథవిధిగా నిఘా ఉంటుందన్నారు.

Rajasthan : ప్రభుత్వ కార్యాలయంలో రూ.2 వేల నోట్ల గుట్టలు, బంగారం కడ్డీలు .. అధికారులు షాక్

రూ.2 వేల నోట్ చెలామణిలో ఉంటుందని, షాపులు ఆ నోట్లను తిరస్కరించరాదని పేర్కొన్నారు. కావాల్సినంత సమయం ఉన్న కారణంగా కస్టమర్లు బ్యాంకులకు పోటెత్తాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రక్రియను సీరియస్ గా తీసుకోవాలన్న ఉద్ధేశంతో డెడ్ లైన్ విధించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం సర్క్యులేషన్ లో ఉన్న కరెన్సీలో రూ.2 వేల నోట్ల విలువ కేవలం 10.8 శాతం మాత్రమేనని, ఆ నోట్లను విడ్ త్రా చేయడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై చాలా స్వల్ప స్థాయిలో ప్రభావం పడుతుందన్నారు.

వెయ్యి రూపాయల నోట్లను మళ్లీ ప్రవేశపెట్టే యోచన లేదని స్పష్టం చేశారు. రూ.2వేల నోట్లను ఉపసంహరించిన నేపథ్యంలో ఆ ఒత్తిడిని తట్టుకునేందుకు వెయ్యి రూపాలయ నోట్లను ప్రవేశపెడతారా అని శక్తికాంత్ దాస్ ను ప్రశ్నించారు. దానికి ఆయన సమాధానం ఇస్తూ వెయ్యి రూపాయల నోట్ ను పున:ప్రవేశపెట్టే ఆలోచన లేదని స్పష్టం చేశారు. అది ఊహాజనితమని, తమ వద్ద అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని పేర్కొన్నారు.

Rs 2000 denomination: రూ.2 వేల నోట్లను చలామణీ నుంచి ఉపసంహరిస్తున్నాం: ఆర్బీఐ సంచలన ప్రకటన

మరోవైపు రూ.2 వేల నోట్ల మార్పిడి లేదా బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ కోసం ఎలాంటి ఐడీ ప్రూఫ్ అవసరం లేదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పేర్కొంది. అలాగే ఏ విధమైన ఫార్మ్ లేదా స్లిప్ పూరించాల్సిన పని లేదని పేర్కొంది. ఈ మేరకు ఆదివారం ఎస్ బీఐ తన అన్ని శాఖలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఎలాంటి గుర్తింపు కార్డు లేదా ఫార్మ్ లేకుండా రూ.20 వేల వరకు రూ.2 వేల నోట్లను బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేయవచ్చని లేదా మార్చుకోవచ్చని తెలిపింది.

బ్యాంకుల్లో రూ.2 వేల నోట్లు డిపాజిట్ లేదా మార్పిడి కోసం ఆధార్ కార్డ్ లాంటి గుర్తింపు పత్రాలు సమర్పించడంతోపాటు ఒక ఫార్మ్ ను పూరించాల్సివుంటుందని సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎస్ బీఐ దీనిపై స్పందించింది. రూ.2 వేల నోట్ల మార్పిడి లేదా బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ కోసం ఎలాంటి ఐడీ ప్రూఫ్ అవసరం లేదని, ఏ విధమైన ఫార్మ్ లేదా స్లిప్ పూరించాల్సిన పని లేదని పేర్కొంది.

2000 Notes ban: బంగారం దుకాణాల‌వైపు బడా బాబుల పరుగు.. రూ. 2వేల నోట్లు మార్చుకొనేందుకు కొత్త మార్గాలు..

కాగా, రూ.2 వేల నోట్ల చెలామణిని నిలిపివేస్తున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీబీ) శుక్రవారం తెలిపిన విషయం తెలిసిందే. అయితే ప్రజలు ఆ నోట్లను బ్యాంకుల్లో మార్పిడి చేసుకోవచ్చని లేదా తమ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేసుకోవచ్చని సూచించింది. ఆర్బీఐకి చెందిన 19 ప్రాంతీయ కార్యాలయాలతోపాటు ఇతర బ్యాంకులు రూ.2 వేల నోట్లను మే23వ తేదీ నుంచి స్వీకరిస్తాయని వెల్లడించింది.

ఒకవేళ బ్యాంకులో ఖాతా లేకపోయినా రూ.20 వేల వరకు రూ.2 వేల నోట్లను మార్పిడి చేసుకోవచ్చని తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఈ నోట్లను మార్పిడి లేదా డిపాజిట్ చేసుకోవచ్చని పేర్కొంది. క్లీన్ నోట్ పాలసీ కింద రూ.2 వేల నోట్ల చెలామణిని నిలిపివేస్తున్నామని ఆర్బీఐ స్పష్టం చేసింది.