RBI hiked repo rate: ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. మరోసారి వడ్డీరేట్లు పెంపు

ఆర్‌బీఐ(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) కీలక నిర్ణయం తీసుకుంది. మళ్లీ వడ్డీ రేట్లు పెంచింది. రెపోరేటు 50 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్...

RBI hiked repo rate: ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. మరోసారి వడ్డీరేట్లు పెంపు

Rbi Governor

RBI hiked repo rate: ఆర్‌బీఐ(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) కీలక నిర్ణయం తీసుకుంది. మళ్లీ వడ్డీ రేట్లు పెంచింది. రెపోరేటు 50 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు. దీంతో ప్రస్తుతం రెపో రేటు 4.4 నుంచి 4.9శాతానికి పెరిగింది. పెంచిన వడ్డీ రేట్లు తక్షణమే అమల్లోకి రానున్నాయి. ఆర్‌బిఐ గవర్నర్ నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి)లోని ఆరుగురు సభ్యులు ఏకగ్రీవంగా తాజా రేట్ల పెంపునకు ఓటు వేశారు. దీంతో రెపో రేటును 4.9 శాతానికి పెంచారు.

RBI: మూడేళ్లుగా రూ.2వేల నోట్ల ముద్రణ ఆపేయడానికి కారణం.. రద్దేనా

దాదాపు నెల రోజుల వ్యవధిలో రెండు సార్లు రెపోరేటు పెరిగింది. ఇదిలా ఉంటే అధిక ద్రవ్వోల్బణం దృష్ట్యా విధాన వైఖరిని క్రమక్రమంగా కఠినతరం చేయనున్నట్లు ఆర్బీఐ ఇప్పటికే సంకేతాలిచ్చింది. రిటైల్ ద్రవ్వోల్బణం ఏప్రిల్ లో 7.79 శాతానికి చేరింది. అయితే ఇది ఎనిమిదేళ్ల గరిష్ఠ స్థాయి. ఈ నేపథ్యంలో కీలక రేట్ల పెంపు ఎక్కువగా ఉండొచ్చనే అభిప్రాయాన్ని మార్కెట్‌ నిపుణులు ముందే వ్యక్తం చేశారు. ద్రవ్వోల్బణం పెరగడానికి కమొడిటీలు, ముడి చమురు ధరలే కారణంగా కనిపిస్తుంది.

RBI New Guidelines : బంగారం దిగుమతులపై ఆర్‌బీఐ కొత్త రూల్స్.. వారికి మాత్రమేనట..!

మరోవైపు ఆర్బీఐ కీలక నిర్ణయంతో బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు సైతం వడ్డీ రేట్లను పెంచనున్నాయి. ముఖ్యంగా గృహ వినియోగదారులకు ఈఎంఐ భారం కానుంది. ఇప్పటికే రుణం తీసుకున్న వారికి బ్యాంకులు ఈఎంఐలలో ఎలాంటి మార్పు చేయనప్పటికీ ఈఎంఐలు కట్టాల్సిన నెలల సంఖ్య పెరుగుతుంది.