RSS సిగ్గుపడాలి…ప్రభుత్వానికి RBI ఆ మాట చెప్పాలన్న చిదంబరం

  • Published By: venkaiahnaidu ,Published On : May 23, 2020 / 10:43 AM IST
RSS సిగ్గుపడాలి…ప్రభుత్వానికి RBI ఆ మాట చెప్పాలన్న చిదంబరం

ప్రధాని మోడీ,ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తప్పుడు లెక్కలు చెబుతున్నారని కాంగ్రెస్ నాయకుడు చిదంబరం విమర్శించారు. ఇటీవల ప్రకటించిన 20లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీపై మోడీ సర్కార్ పునరాలోచించాలని చిదంబరం అన్నారు. ఈ ప్యాకేజీ దేశ జీడీపీలో 10శాతానికి సమానమైన ప్యాకేజ్ ఇది అంటూ కేంద్రప్రభుత్వం చెప్పుకుంటుందని,వాస్తవానికి ఇది దేశ జీడీపీలో 1శాతానికి కన్నా తక్కువ అని చిదంబరం అన్నారు.

డిమాండ్ పడిపోయిందని,2020-21లో నెగిటివ్ వృద్ధి వైపుగా దేశం వెళ్తుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ చెప్పారని,అలాంటప్పుడు ఆయన ఎందుకు ఎక్కువ ద్రవ్యతను ద్రవ్య లభ్యతను సమకూరుస్తున్నాడని చిదంబరం ప్రశ్నించారు. తమ డ్యూటీ తమను చేసుకోనివ్వమని  మొహ​మాటం లేకుండా ప్రభుత్వానికి గట్టిగా చెబుతూనే, ఆర్థిక చర్యలు తీసుకోవాలని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌కు చిదంబరం సూచించారు. 

GDP క్షీణిస్తోందని స్వయంగా ఆర్‌బీఐ గవర్నర్‌ స్టేట్ మెంట్ తర్వాత కూడా…GDPలో 1 శాతం కంటే తక్కువగా ఉన్న ఉద్దీపస ప్యాకేజీపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌, కేంద్ర ప్రభుత్వం తమను తాము పొగుడుకుంటున్నారని చిదంబరం విమర్శించారు. దేశ ఆర్థిక వ్యవస్థ పతనానికి కారణమైన ప్రభుత్వ విధానాలపై ఆర్‌ఎస్‌ఎస్‌ సిగ్గుడాలని చిదంబరం అన్నారు.

Read: చైనా కవ్వింపులతో బోర్డర్ లో టెన్షన్…లఢఖ్ లో ఆర్మీ చీఫ్