RBI Fresh Moratorium : కొవిడ్ సంక్షోభంలో ఆర్బీఐ ఆఫర్ : చిన్న రుణగ్రహితలకు కొత్త మారటోరియానికి అనుమతి

భారతదేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. కరోనా రెండో దశ ఉద్ధృతి చాలా తీవ్రంగా ఉంది. దేశం కొవిడ్ సంక్షోభంలో కూరుకుపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు లాక్ డౌన్ల దిశగా అడుగులు వేస్తున్నాయి.

RBI Fresh Moratorium : కొవిడ్ సంక్షోభంలో ఆర్బీఐ ఆఫర్ : చిన్న రుణగ్రహితలకు కొత్త మారటోరియానికి అనుమతి

Rbi Allows Fresh Moratorium For Some Small Borrowers Amid Covid 19 Crisis

RBI Offers fresh moratorium for some small borrowers : భారతదేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. కరోనా రెండో దశ ఉధృతి  చాలా తీవ్రంగా మారుతోంది. ఇప్పటికే దేశమంతా కొవిడ్ సంక్షోభంలో కూరుకుపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు లాక్ డౌన్ల దిశగా అడుగులు వేస్తున్నాయి. ఫలితంగా ఆర్థికంగా నష్టంతో పాటు చాలామంది ఉపాధిని కోల్పోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రుణ గ్రహితలకు ఊరటనిచ్చింది. కొంతమంది రుణగ్రహీతలకు రుణాలు తిరిగి చెల్లించేందుకు ఎక్కువ సమయం ఇవ్వాలని బుధవారం (మే 5) బ్యాంకులను కోరింది. ఆర్బీఐ గవర్నర్ మీడియా సమావేశంలో దేశ ఆర్థిక పరిస్థితులపై ప్రస్తావించారు.

కరోనా సెకండ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు దేశ బ్యాకింగ్ రంగం సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అవసరమైన అన్ని వర్గాలను ఆదుకునేందుకు ఆర్బీఐ తనవంతు సహకారాన్ని అందిస్తుందని భరోసా ఇచ్చారు. అలాగే వ్యక్తిగత, చిన్న రుణగ్రహీతలకు రూ .25 కోట్ల వరకు రుణాలు కలిగి ఉన్న రుణాలను పునర్వ్యవస్థీకరించడానికి మరో అవకాశం కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. 2020లో రుణాలను రిస్ట్రక్చరింగ్ చేసుకోకుండా ఉండి.. మార్చి 2021 వరకు ప్రామాణిక ఖాతాలుగా ఉన్న రుణగ్రహీతల్లో చిన్న మధ్యతరహా సంస్థలకు ఈ మారటోరియం అందుబాటులో ఉంటుందని గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. 2022 మార్చి 31 నాటికి ఆసుపత్రులు, ఆక్సిజన్ సరఫరాదారులు, టీకా దిగుమతిదారులు, కోవిడ్ ఔషధాల కోసం బ్యాంకులు రూ .50 వేల కోట్ల ప్రాధాన్యత రుణాలు ఇస్తున్నట్లు ఆర్‌బిఐ గవర్నర్ ప్రకటించారు.

గతంలో రెండు సంవత్సరాల పాటు మారటోరియం సదుపాయాన్ని పొందిన వారికి మరో రెండేళ్ల మారటోరియం అందించనుంది. మార్చి 2022 వరకు ఎన్‌పీఏల కోసం నిర్దిష్ట కేటాయింపు ఇవ్వనుంది. సూక్ష్మ, చిన్న ,ఇతర అసంఘటిత రంగ సంస్థలకు మరింత సహకారం అందించనుంది. మార్చి 2022 వరకు వరకు కోవిడ్-19 సంబంధిత మౌలిక వసతుల కోసం రూ.50 వేల కోట్ల కేటాయించింది.

ప్రస్తుత రెపో రేటుకు రూ.10,000 కోట్లు, రుణగ్రహీతకు రూ.10 లక్షల వరకు కొత్త రుణాలు అందించనుంది. అక్టోబర్ 31,2021 వరకు ఈ సదుపాయం అందుబాటులో ఉండనుంది. ఇంతకుముందు రిస్ట్రక్చరింగ్ తీసుకోని, మార్చి 2021 నాటికి ప్రామాణికమైన రూ .25 కోట్ల వరకు రుణగ్రహీతలకు 2021 సెప్టెంబర్ 30 వరకు రిస్ట్రక్చరింగ్‌కు పరిగణనలోకి తీసుకుంటామని ఆర్బీఐ గవర్నర్ ప్రకటించారు.