Rs 2000 Notes: మూడేళ్లక్రితమే ఆగిపోయిన రూ.2000 నోట్ల ప్రింటింగ్.. దశలవారీగా నోట్ల రద్దు: బీజేపీ ఎంపీ వెల్లడి

రూ.2000 నోట్లు రద్దవుతాయా? ఇప్పటికే వీటి ముద్రణ ఆగిపోయిందా? ఈ విషయంపై పార్లమెంటులో బీజేపీ ఎంపీ సుశీల్ మోది ఒక ప్రకటన చేశారు.

Rs 2000 Notes: మూడేళ్లక్రితమే ఆగిపోయిన రూ.2000 నోట్ల ప్రింటింగ్.. దశలవారీగా నోట్ల రద్దు: బీజేపీ ఎంపీ వెల్లడి

Rs 2000 Notes: దేశంలో రూ.2000 నోట్లను ముద్రించడం ఆర్బీఐ మూడేళ్లక్రితమే ఆపేసిందని వెల్లడించారు బీజేపీ ఎంపీ సుశీల్ మోది. తీవ్రవాదులకు నిధుల సమీకరణ, డ్రగ్స్ రవాణా, నల్ల ధనం కింద ఈ నోట్లు ఉపయోగపడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. సోమవారం పార్లమెంటులో ఈ విషయంపై సుశీల్ మోదీ మాట్లాడారు.

Viral Video: సింహాలతో అడుకుంటున్న బాలుడు.. చెయ్యి ఎలా కొరికిందో చూడండి.. వీడియో వైరల్

‘‘తీవ్రవాదులకు నిధులు, డ్రగ్స్ రవాణా, నల్లధనం వంటి వాటికి రూ.2,000 నోట్లు ఉపయోగపడుతున్నాయి. దీంతో ఆర్బీఐ మూడేళ్లక్రితమే వాటిని ముద్రించడం ఆపేసింది. ఆర్థికంగా అభివృద్ధి చెందిన అమెరికా, చైనా, జర్మనీ, జపాన్ వంటి దేశాల్లో 100 కంటే పెద్ద కరెన్సీ నోట్లు ఉండవు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం కూడా దీని గురించి ఆలోచించి, దశలవారీగా ఈ నోట్లను రద్దు చేయాలి. రూ.2,000 నోట్లు మార్చుకునేందుకు ప్రజలకు కొంతకాలం అవకాశం కల్పించాలి’’ అని సుశీల్ మోదీ తెలిపారు. ఈ నిర్ణయం వల్ల బ్లాక్ మనీ తగ్గిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, రూ.2,000 నోట్లు రద్దయ్యాయని చాలా కాలం నుంచి ప్రచారం జరుగుతోంది.

గత ఫిబ్రవరిలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ప్రచారంపై స్పందించారు. కేంద్రం అలాంటి ఆదేశాలేమీ ఇవ్వలేదన్నారు. నోట్ల విషయంలో బ్యాంకులకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని చెప్పారు. 2016లో ప్రధాని నరేంద్ర మోదీ అప్పటి నోట్లను రద్దు చేశారు. రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తర్వాత కొత్త రూ.500, రూ.2000 నోట్లను తీసుకొచ్చారు.