Debit Credit : కొత్త రూల్.. ఇక డెబిట్, క్రెడిట్ కార్డు నెంబర్లు గుర్తు పెట్టుకోవాల్సిందే!

డెబిట్, క్రెడిట్ కార్డుదారులకు గమనిక. ఇకపై మీరు మీ కార్డు నెంబర్లు కచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. లేదంటే ఇబ్బందులు తప్పువు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) కొత్తగా

Debit Credit : కొత్త రూల్.. ఇక డెబిట్, క్రెడిట్ కార్డు నెంబర్లు గుర్తు పెట్టుకోవాల్సిందే!

Debit Credit

Debit Credit : డెబిట్, క్రెడిట్ కార్డుదారులకు గమనిక. ఇకపై మీరు మీ కార్డు నెంబర్లు కచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. లేదంటే ఇబ్బందులు తప్పువు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) కొత్తగా తీసుకుని రాబోయే నిబంధనలే ఇందుకు కారణం. ఆ నిబంధన అమల్లోకి వస్తే.. ఇక నుంచి ప్రతి ఖాతాదారుడు తమ 16 అంకెల డెబిట్/ క్రెడిట్ కార్డు నంబర్లతో పాటు సీవీవీ, గడువు తేదీ వంటి వివరాలను గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది.

బ్యాంకుల్లో క‌స్ట‌మ‌ర్ల డేటా స్టోరేజీ పాల‌సీపై మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ఆర్బీఐ స‌వ‌రించింది. కొత్త మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం డెబిట్ కార్డులు లేదా క్రెడిట్ కార్డుల‌తో లావాదేవీలు జ‌రిపిన ప్ర‌తిసారీ క‌స్ట‌మ‌ర్లు త‌మ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులోని 16 డిజిట‌ల్ నంబ‌ర్లు చెప్పాల్సి ఉంటుంది. స్టోరింగ్ డేటా లేని పేమెంట్స్ ఆప‌రేట‌ర్ల దగ్గర స‌ర్వీసు అందుకుంటున్న క‌స్ట‌మ‌ర్ల డేటా భ‌ద్ర‌త కోస‌మే ఆర్బీఐ ఈ నిర్ణ‌యం తీసుకుంది.

2022 జనవరి నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లో వచ్చే చాన్సుంది. ఖాతాదారులు లావాదేవీలు జ‌రిపిన ప్ర‌తిసారి మీ డెబిట్ కార్డ్ నంబ‌ర్లు, పాస్‌వ‌ర్డ్‌. సీవీవీ నంబ‌ర్ చెప్పాల్సి ఉంటుంది. ఈ మేర‌కు ఇప్ప‌టివ‌ర‌కు ఉన్న‌ ప్ర‌తి డెబిట్ లేదా క్రెడిట్ కార్డుపై కొత్త కార్డులు జారీ అవుతాయి. ఆర్బీఐ తీసుకున్న నిర్ణ‌యానికి ఆన్‌లైన్ పేమెంట్స్ సంస్థ‌ యూపీఐ ఆమోదం తెలిపింది.

వినియోగదారుల డెబిట్‌/క్రెడిట్‌ కార్డుల వివరాలు సైబర్‌ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లకుండా ఉండేందుకు, పేమెంట్‌ సంస్థలు యూజర్ల కార్డు వివరాలను ఇతర సంస్థలతో పంచుకోకుండా ఉండేందుకు ఈ నిబంధనలు తెచ్చినట్టు ఆర్బీఐ తెలిపింది. ఈ ఏడాది జస్‌పే, మొబిక్విక్‌, ఎయిరిండియా, అప్‌స్టోక్‌ వంటి పేమెంట్‌ గేట్‌వే సర్వర్లపై సైబర్‌ దాడులు జరిగి కస్టమర్ల డెబిట్‌/క్రెడిట్‌ కార్డుల వివరాలను సైబర్‌ నేరగాళ్లు దొంగిలించడం తెలిసిందే. ఆర్బీఐ కొత్త రూల్ ప్రకారం పేమెంట్ అగ్రిగేటర్లు, మర్చంట్లు(అమెజాన్, ఫ్లిప్ కార్ట్, నెట్ ఫ్లిక్స్) తమ సర్వర్లు లేదా డేటా బేస్ లలో కస్టమర్ల కార్డు డేటాను స్టోర్ చేసుకోలేవు.

అయితే, ‘న్యూ పేమెంట్‌ అగ్రిగేటర్‌/పేమెంట్‌ గేట్‌వేస్‌ (పీఏ/పీజీ)’ పేరిట తీసుకొచ్చిన ఈ కొత్త రూల్స్‌ అమలు చేయడానికి పేమెంట్‌ గేట్‌వే సంస్థలు విముఖత వ్యక్తం చేస్తున్నాయి.

* ఆన్‌లైన్‌లో చెల్లింపులు జరిపే వినియోగదారుడి డెబిట్‌/క్రెడిట్‌ కార్డు వివరాలను పేమెంట్‌ గేట్‌వే సంస్థలు సర్వర్లలో నిక్షిప్తం చేసుకోవద్దు.
* అప్పటికే రికార్డయిన కార్డు వివరాల సాయంతో సీవీవీ నంబర్‌ ఆధారంగా జరిపే వన్‌-క్లిక్‌ చెక్‌అవుట్‌ సర్వీసులను ఇకపై నిలిపివేయాలి.
* చెల్లింపులు జరిపే ప్రతీసారి వినియోగదారుడు 16 అంకెల కార్డు నంబర్‌ను విధిగా నమోదు చేయాలి. ఈ నంబర్‌ను ఆ లావాదేవీ పూర్తయ్యేవరకే సర్వర్‌లో ‘టోకెనైజ్డ్‌ కీ ’ రూపంలో ఉంచాలి. లావాదేవీ పూర్తవ్వగానే ఆ వివరాలను తీసెయ్యాలి.

పేమెంట్ గేట్‌వే సంస్థ‌లు ఎందుకు వ్య‌తిరేకిస్తున్నాయి?
* ఒకవేళ లావాదేవీ అసంపూర్ణంగా పూర్తయితే..‘టోకెనైజ్డ్‌ కీ’ సాయంతో వినియోగదారుడి బ్యాంక్‌ ఖాతాలో సొమ్మును జమ చేయాలి. దీన్ని ఆర్బీఐ పర్యవేక్షిస్తుంది.
* ఆర్బీఐ నుంచి లైసెన్సులు పొందిన పేమెంట్‌ గేట్‌వే సంస్థలు మాత్రమే కస్టమర్ల ‘టోకెనైజ్డ్‌ కీ’ని యాక్సెస్‌ చేయగలవు. లైసెన్సుల దరఖాస్తు చివరి తేదీ సెప్టెంబర్‌ 30గా నిర్ణయించారు.

పేమెంట్‌ గేట్‌వే ల అభ్యంతరాలు.. విజ్ఞప్తులు
* ఆన్‌లైన్‌ లావాదేవీ జరిపిన ప్రతిసారి కస్టమర్‌ 16 అంకెల డెబిట్‌/క్రెడిట్‌ కార్డు వివరాలను నమోదు చేయడం వారికి కష్టంగా మారొచ్చు. దీంతో ఆసక్తి సన్నగిల్లి కొనుగోళ్ల రేటు తగ్గొచ్చు. కాబట్టి, కొత్త నిబంధనలను అమలు చేయొద్దు. ఈ వాదనను ఆర్బీఐ తోసిపుచ్చింది.

* లావాదేవీలు ఫెయిల్‌ అయిన వినియోగదారుల కార్డు వివరాలను లైసెన్స్‌ పొందిన పేమెంట్‌ గేట్‌వే సంస్థలు ప్రత్యేక సర్వర్లలో స్టోర్‌ చేసుకునేందుకు అవకాశమివ్వాలి. ఇది వన్‌-క్లిక్‌ చెక్‌అవుట్‌కు సాయంగా ఉంటుంది.

* కొత్త నిబంధనల అమలుకు 2022 జనవరి తుదిగడువు. దీనిని పొడిగించాలి. ఈ విజ్ఞప్తిని ఆర్బీఐ నిరాకరించింది. 2021 జూలైకి గడువు ముగియగా ఆరు నెలలు పొడిగించినట్టు గుర్తుచేసింది.