డేంజరస్ యాప్ : మీ అకౌంట్ లో డబ్బు మాయం

ఆన్‌లైన్ బ్యాంకింగ్‌ని వాడుతున్నారా.. అయితే జాగ్రత్త.. హ్యాకర్లు మీ ఎలక్ట్రానిక్ వాలెట్లు, మొబైల్ బ్యాంకింగ్ యాప్స్, యుపిఐ ద్వారా ఖాతాని కొల్లగొట్టేస్తారు అని స్వయంగా రిజర్వ్

  • Published By: veegamteam ,Published On : February 20, 2019 / 07:33 AM IST
డేంజరస్ యాప్ : మీ అకౌంట్ లో డబ్బు మాయం

ఆన్‌లైన్ బ్యాంకింగ్‌ని వాడుతున్నారా.. అయితే జాగ్రత్త.. హ్యాకర్లు మీ ఎలక్ట్రానిక్ వాలెట్లు, మొబైల్ బ్యాంకింగ్ యాప్స్, యుపిఐ ద్వారా ఖాతాని కొల్లగొట్టేస్తారు అని స్వయంగా రిజర్వ్

ఆన్‌లైన్ బ్యాంకింగ్‌ని వాడుతున్నారా.. అయితే జాగ్రత్త.. హ్యాకర్లు మీ ఎలక్ట్రానిక్ వాలెట్లు, మొబైల్ బ్యాంకింగ్ యాప్స్, యుపిఐ ద్వారా ఖాతాని కొల్లగొట్టేస్తారు అని స్వయంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్చరించింది. డిజిటల్ బ్యాంకింగ్‌కి ఆదరణ పెరిగింది. దీన్ని సొమ్ము చేసుకునేందుకు హ్యాకర్లు రంగంలోకి దిగారు. మోసపూరిత యాప్స్ ద్వారా ఫోన్లలో చొరబడి సొమ్ము మొత్తం కాజేస్తున్నని ఆర్బీఐ చెప్పింది.

 

యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్(UPI), డిజిటల్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఇలా ఆన్‌లైన్‌లో ఇంటర్నెట్ ఆధారిత లావాదేవీలకు అలవాటు పడినవారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ హెచ్చరిక చేసింది. ఎనీడెస్క్ పేరుతో ఓ యాప్ జనాల ఖాతాల్లోని డబ్బంతా మాయం చేస్తోందని వార్నింగ్ ఇచ్చింది.  ఈ యాప్‌ని మోసగాళ్లు తమ పనులకు సమర్ధవంతంగా వాడుతున్నట్లు ఫిబ్రవరి 14న ఆర్బీఐకి చెందిన సైబర్ సెక్యూరిటీ, ఐటీ ఎగ్జామినేషన్ సెల్ సంయుక్తంగా నిర్ధారించాయ్.

 

ఎనీ డెస్క్ యాప్ అంటే.. ఇదో రిమోట్ కంట్రోల్ అప్లికేషన్ యాప్..అంటే ఒక సిస్టమ్ నుంచి లాగిన్ అయితే దానికి అటాచ్ చేసిన ఇంకేదైనా సిస్టమ్ నుంచి కానీ మొబైల్ నుంచి కానీ
మిగిలిన కంప్యూటర్లు..మొబైల్స్ ఆపరేట్ చేయవచ్చు. దీంతో మోసం ఎలా చేస్తున్నారంటే..ముందుగా కేటుగాళ్లు ఈ యాప్‌ని డౌన్ లోడ్ చేసుకోమని అడుగుతారు. తర్వాత 9 అంకెలతో కూడిన ఓ కోడ్ సెల్‌ఫోన్లలో రాగానే దాని ద్వారా ఎవరైతే కస్టమర్లు ఉన్నారో వారికి సంబంధించిన మొబైల్ ఫోన్‌ని మోసగాళ్లు ఆపరేట్ చేయగలుగుతారు. ప్రతి యాప్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఫోటోలు..వీడియోలు..ఓటిపిలు షేర్ చేయడానికి అనుమతి ఇస్తారా లేదా అని అడగడం గమనించే ఉంటారు..అలానే ఈ యాప్ కూడా పర్మిషన్ అడుగుతుందనుకుని కస్టమర్లు యాప్‌ అడిగిన ప్రతి పర్మిషన్‌ ఇచ్చేస్తారు. ఒక్కసారి మన మొబైల్ మోసగాళ్ల చేతిలో పడితే ఇక అంతే..పేటీఎం, ఫోన్ పే, ఇలా మొబైల్ వాలెట్లు..బ్యాంకు అక్కౌంట్ల సమాచారంతో అందినకాడికి దోచేస్తారు.

 

ఈ మోసగాళ్ల బారిన పడకుండా ఉండాలంటే.. 
* ముందు మొబైల్ ఫోన్‌కి బ్యాంక్ అక్కౌంట్ ట్రాన్సాక్షన్స్‌కి లింక్ కోసం రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. 
* హెచ్‌టిటిపిఎస్ అంటే హైపర్ టెక్స్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్ ఉన్న బ్యాంకుల ఆన్‌లైన్ వ్యవస్థనే వాడాలి.
* ఇవి లేని ఆన్ లైన్ బ్యాంకింగ్‌ల జోలికి పోవద్దు. 
* ఎప్పటికప్పుడు పిన్ నంబర్లు..పాస్ వర్డ్స్ మార్చుతుండాలి.

 

డిమానిటైజేషన్ తర్వాత డిజిటల్ బ్యాంకింగ్ ఎక్కువ అవడంతోపాటు మోసాలు పెరిగిపోయాయ్. 2017-18 సంవత్సరానికి గానూ ఇలాంటి మోసాల సంఖ్య 2,059గా తేలింది. 110కోట్ల రూపాయల మేర జనం సొమ్ము సైబర్ ఫ్రాడ్స్‌తో కేటుగాళ్లు కాజేశారు. దీంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తనకి సంబంధించిన సైబర్ సెక్యూరిటీ సెల్‌తో దర్యాప్తు చేయిస్తుంటుంది. అందులో భాగంగానే ఈ ఎనీడెస్క్ యాప్ జనాల జేబులు కొట్టేస్తున్నట్లు ప్రకటించింది. ఒక్క ఈ యాప్ మాత్రమేకాదు..ఇలాంటి సైబర్ నేరాలు ఎప్పటికప్పుడు కొత్త మార్గాలలో జరుగుతుంటాయ్. అప్రమత్తంగా ఉండటమే మనకు శ్రీరామ రక్ష.

Read Also :ఏప్రిల్ 6 నుంచి పనిచేయదు: మీ ఫోన్‌లో GPS అప్‌డేట్‌ చేసుకోండి
Read Also :పాక్ పని ఖతం: భారత్ కు ఇజ్రాయిల్ సైనిక సహకారం