Lalit Goyal: పండోరా ప్రకంపనలు.. పారిపోతున్న లలిత్ గోయల్‌ అరెస్ట్

ఐఆర్‌ఈవో ఎండీ లలిత్ గోయల్‌‌ను అరెస్ట్ చేశారు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు

Lalit Goyal: పండోరా ప్రకంపనలు.. పారిపోతున్న లలిత్ గోయల్‌ అరెస్ట్

Lalith Goyal

Lalit Goyal: పండోరా పేపర్లు ప్రపంచవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించగా.. సొంత దేశాన్ని కాదనుకుని తక్కువ పన్ను ఉండే విదేశాలకు సంపద తరలించిన వారి వివరాలను ఇప్పటికే ఇంటర్నేషనల్‌ కన్సార్షియం ఆఫ్‌ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్స్‌(ఐసీఐజే) విడుదల చేసింది. ఈ క్రమంలోనే పండోరా పత్రాల లీకేజితో డొంక కదులుతుంది.

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే పన్ను ఎగవేతదారులను గుర్తించే పనిలో ఉండగా.. లేటెస్ట్‌గా ఐఆర్‌ఈవో ఎండీ లలిత్ గోయల్‌‌ను అరెస్ట్ చేశారు. ఢిల్లీ విమానాశ్రయం నుంచి విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నించిన లలిత్ గోయల్‌‌ను అధికారులు అరెస్ట్ చేశారు.

మనీలాండరింగ్ అభియోగాలపై లలిత్ గోయల్‌ను అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు అధికారులు. డిపాజిటర్ల సొమ్మును విదేశాలకు దారిమళ్లించినట్టు దర్యాప్తులో వెల్లడైనట్లు అధికారులు చెబుతున్నారు. 2010లో, 73మిలియన్ డాలర్లను వివిధ ట్రస్ట్‌లకు ట్రాన్స్‌ఫర్ చేసిన లలిత్ గోయల్.. విదేశాలకు తరలించిన సొమ్మును ట్రస్టుల వైట్ మనీగా మార్చే ప్రయత్నం చేశారు.

పండోర పేపర్ల లీక్ తర్వాత.. ప్రపంచవ్యాప్తంగా విదేశాల్లో దాచిన సొమ్ము మొత్తం విలువ కనీసం 5.6 ట్రిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువగా ఉంటుందని ఐసీఐజే అంచనా వేసింది. పన్ను తక్కువ ఉన్న దేశాలకు తరలించే సంపద వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలకు ఏటా 600 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతున్నట్లు అంచనా వేస్తున్నారు.

వరదలతో వణికిపోతున్నకేరళ _ Flood hit Kerala severely _ Kerala floods