Covaxinకు అత్యవసర అనుమతి ఆలస్యం..WHO కీలక వ్యాఖ్యలు

కరోనా కట్టడి కోసం హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ వ్యాక్సిన్ కు అత్యవసర అనుమతిని ఇవ్వడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కీలక వ్యాఖ్యలు చేసింది. ఇటీవ

Covaxin కరోనా కట్టడి కోసం హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ వ్యాక్సిన్ కు అత్యవసర అనుమతిని ఇవ్వడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కీలక వ్యాఖ్యలు చేసింది. ఇటీవల కొవాగ్జిన్‌కు అనుమతి వస్తుందని అంతా భావించినప్పటికీ అది జరగలేదు. అక్టోబరు 26న సమావేశమైన డబ్యూహెచ్ వో సాంకేతిక నిపుణుల బృందం.. భారత్ బయోటెక్ నుంచి అదనపు స్పష్టత కోరినట్లు తాజాగా జెనీవాలో నిర్వహించిన మీడియా సమావేశంలో WHO ఉన్నతాధికారి డాక్టర్ మారియాంజిలా సిమాన్ తెలిపారు.

కోవాగ్జిన్ ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ (EUL) కోసం అవసరమైన సమాచారాన్ని భారత్ బయోటెక్ క్రమం తప్పకుండా, చాలా త్వరగా అందజేస్తోందని..చివరిగా డేటాను అక్టోబర్ 18న సమర్పించారని ఆమె తెలిపారు. ఈ వారాంతంలో భారత్ బయోటెక్ నుంచి అవసరమైన అదనపు సమాచారం అందుతుందని సాంకేతిక సలహా బృందం ఆకాంక్షిస్తుందన్నారు. కొవాగ్జిన్ ఆమోదంపై నిపుణుల కమిటీ వచ్చేవారం తుది నిర్ణయం తీసుకోనుందని తెలిపారు. అయితే అత్యంత నాణ్యత కలిగిన వ్యాక్సిన్ లను భారతీయ సంస్థలు ఉత్పత్తి చేస్తాయని WHO బలంగా నమ్ముతుందని ఆమె అన్నారు.

కాగా, దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి కోవిడ్ వ్యాక్సిన్ కోవాగ్జిన్ తీసుకున్నవాళ్లు విదేశాలకు వెళ్లడం కష్టతరంగా మారుతోంది. అత్యవసర వినియోగానికి అనుమతులు ఇవ్వాలని భారత్ బయోటెక్ సంస్థ ప్రపంచ ఆరోగ్య సంస్థను కోరింది. చాలా దేశాలు WHO ఇచ్చే ఈ అనుమతులను ఆధారంగా చేసుకుంటున్నాయి. దీంతో కొవాగ్జిన్ టీకా వేసుకున్న భారతీయులకు విదేశీ ప్రయాణాలు కష్టంగా మారాయి.

ALSO READ PM Modi : ఇటలీలో గుజరాతీ భాషలో మోదీ సమాధానం

ట్రెండింగ్ వార్తలు