Maharashtra: మహారాష్ట్ర అసెంబ్లీలో ఫౌంటేన్ పెన్నులపై నిషేధం.. ఎందుకో తెలుసా?
శాసనసభ్యులు మినహా మిగిలిన అందరికీ ఇంక్ పెన్నులు నిషేధించారు. శీతాకాల సమావేశాల కోసం శాసనసభలో అడుగుపెట్టిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల్లో ఇంకు పెన్ను దాడి నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు తప్పించుకున్నట్లు సమాచారం. ఇంకు పెన్నులతో వెళ్లిన కొందరికి లోపలికి అనుమతించకుండా గేటు వద్దే భద్రతా సిబ్బంది అడ్డుకున్నట్లు తెలిసింది.

Days after the episode with Maha minister, ink pens banned in Maharashtra legislature premises
Maharashtra: మహారాష్ట్ర మంత్రి చంద్రకాంత్ పాటిల్‌పై సిరా దాడి జరిగిన అనంతరం మహారాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర అసెంబ్లీకి ఎవరూ ఫౌంటేన్ పెన్ను తీసుకురాకూడదని తేల్చి చెప్పింది. అసెంబ్లీ లోపలికి వచ్చే సమయంలోనే శాసన సభ్యులు కాకుండా ఇతరులెవరైనా సరే గేట్ వద్దే తనిఖీ చేస్తారని, ఏదైనా పాత లిక్విడ్ ఫౌంటేన్ పెన్నులు కనుక ఉంటే వాటిని భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకుంటుందని తెలిపారు.
Nakul Nath: భారత్ జోడో యాత్ర కంటే నా ర్యాలీలే పవర్ఫుల్.. కాంగ్రెస్ యువనేత ఆసక్తికర వ్యాఖ్యలు
శాసనసభ్యులు మినహా మిగిలిన అందరికీ ఇంక్ పెన్నులు నిషేధించారు. శీతాకాల సమావేశాల కోసం శాసనసభలో అడుగుపెట్టిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల్లో ఇంకు పెన్ను దాడి నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు తప్పించుకున్నట్లు సమాచారం. ఇంకు పెన్నులతో వెళ్లిన కొందరికి లోపలికి అనుమతించకుండా గేటు వద్దే భద్రతా సిబ్బంది అడ్డుకున్నట్లు తెలిసింది.
Karnataka: పాఠశాలల్లో వీర సావర్కర్ చిత్రపటాలను ఏర్పాటు చేయనున్న బీజేపీ
మహారాష్ట్ర ఉన్నత & సాంకేతిక విద్యా శాఖ మంత్రి, భారతీయ జనతా పార్టీ నేత అయిన చంద్రకాంత్ పాటిల్ కొద్ది రోజుల క్రితం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహేబ్ అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఒక వ్యక్తి ఆయనపై ఇంకు పెన్నుతో దాడి చేశారు. ఈ సంఘటన అనేక మంది పోలీసు సిబ్బందిని సస్పెండ్ సదఇాకగ. కాగా, ఈ దాడికి పాల్పడిన ఒక స్థానిక జర్నలిస్ట్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం అతడు బెయిల్‌పై విడుదలయ్యాడు.