ఒక్క వారంలోనే సిటీ మొత్తం 4వేల పెళ్లిళ్లు

ఒక్క వారంలోనే సిటీ మొత్తం 4వేల పెళ్లిళ్లు

Rajasthan: బుధవారం నవంబర్ 25నుంచి నవంబర్ 30వరకూ అంటే వారం రోజులు లోపే దాదాపు 4వేల పెళ్లిళ్లు జరగనున్నాయి. హిందూ క్యాలెండర్ ప్రకారం.. ముహుర్తాలు బాగా కుదరడంతో అంతా ఒకేసారి వివాహాలకు రెడీ అయిపోయారు. రాజస్థాన్ లోని జైపూర్ వేదికగా జరగనున్న ఈ పెళ్లిళ్లతో కొవిడ్ వ్యాప్తి మరింత పెరుగుతుందేమోనన్న భయం పెరిగిపోయింది.

ప్రతి రోజూ 3వేలకు పైగా కరోనావైరస్ కేసులు రాష్ట్రంలో నమోదవుతున్న పరిస్థితుల్లో మరింత ఆందోళన కలిగిస్తుందని ఆరోగ్యశాఖ అధికారులు అంటున్నారు. గత నాలుగు రోజులుగా రాజస్థాన్ లో కరోనా కేసులు 1.34శాతం పెరిగాయి. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 26వేలకు పైగా పెరిగింది. జైపూర్ సిటీ ఒక్కదాంట్లోనే 600కేసులు నమోదయ్యాయి. రాష్ట్రం మొత్తంలో ఇదే టాప్.



అశోక్ గెహ్లాత్ ప్రభుత్వం.. పెళ్లికి కేవలం 100మంది మాత్రమే అతిథులు హాజరవ్వాలంటూ ఆంక్షలు విధించింది. ‘నా స్నేహితులు చాలా మంది హాజరుకాలేకపోతున్నారు. ప్రత్యేకించి విదేశాల్లో ఉన్న వారు రావడానికి కుదరడం లేదు. నాకు తెలిసి చిన్న మొత్తంలో రావడం కూడా సేఫ్ అనే అనుకుంటున్నా’ అని ఓ పెళ్లి కూతురు నిహారిక సింగ్ అంటున్నారు.

‘మాకు సోషల్ సర్కిల్ ఎక్కువ. కానీ, ఇక్కడ 100మంది కంటే తక్కువ మందే హాజరుకావాలంటున్నారు. కొందరైతే ఈ భయంతో రావడానికి కూడా వెనుకడుగేస్తున్నారు. ముందుగానే ఆర్డర్ ఇచ్చినా ఎవరూ రాకపోవడంతో ఎకనామికల్ గా సెట్ అవడం లేదు’ అని పెళ్లికూతురు తల్లి చెప్తుంది.

రాష్ట్ర రాజధాని జైపూర్ లో మాత్రమే నవంబర్ 25, 27, 30తేదీల్లో భారీ సంఖ్యలో పెళ్లిళ్లు జరగనున్నాయి. ‘మొదటి విషయం ఏంటంటే మాస్క్ పెట్టుకుని పూజ చేయలేం. బంధువులందరినీ ఒకే చోట కూర్చోనివ్వకూడదని వధూవరుల పేరెంట్స్ కు ఆదేశాలిస్తున్నాం’ అని ప్రధాన మత గురువు కమల్ చంద్ శాస్త్రి అంటున్నారు.

‘పెళ్లి ఒకవేళ నిబంధనలకు మించి హాజరైతే జరిమానా కట్టాల్సిందే. వివాహం జరుగుతున్నప్పుడు అధికారులు గానీ, పోలీసులు గానీ ఎంటర్ అవరు. పెళ్లి తర్వాతే తీసిన వీడియో రికార్డింగ్ ను బట్టి రూ.10వేల నుంచి రూ.25వేల మధ్యలో జరిమానా విధిస్తారు’ అని రాజస్థాన్ హెల్త్ డైరక్టర్ డా.కేకే శర్మ అంటున్నారు.