కరోనా నయమైందా ? అయినా..జాగ్రత్త, ఈ లక్షణాలుంటాయి – కేంద్రం మార్గదర్శకాలు

  • Published By: madhu ,Published On : September 13, 2020 / 02:42 PM IST
కరోనా నయమైందా ? అయినా..జాగ్రత్త, ఈ లక్షణాలుంటాయి – కేంద్రం మార్గదర్శకాలు

కరోనా నయమైందా ? హమ్మయ్యా అని ఊపిరిపీల్చుకున్నారా ? అయితే..వైరస్ మీ శరీరంలో నుంచి పోయినా..కొన్ని అనారోగ్య లక్షణాలు మాత్రం ఉంటాయని కేంద్రం చెబుతోంది. ఒళ్లు నొప్పులు, అలసట, దగ్గు, జలుబు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది తదితర సమస్యలు ఉంటాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

అయితే..కొంత ఊపిరిపీల్చుకునే అంశం కూడా చెప్పింది. ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని తెలిపింది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారు త్వరగా కోలుకొనే ఛాన్స్ లేదని కొంత టైం పడుతుందని తెలిపింది. కోలుకున్న అనంతరం వ్యాయామం చేయాలని, వ్యాధి నిరోధక శక్తి పెంచుకొనే ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపింది.



గుండె పని తీరుతో పాటు..రక్తంలో ఆక్సిజన్ ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవాలని చెప్పింది. కరోరాన సోకిన సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో అదే విధంగా చేయాలంది. బయటకు వెళ్లిన సమయంలో మాస్క్ కట్టుకోవడం, శానిటైజర్ చేతుల్లకు రాసుకోవడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, సోషల్ డిస్టెన్ పాటించాలని చెప్పింది.

భారతదేశంలో కరోనా విషయానికి వస్తే..భారీగానే కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో అత్యధికంగా 97,570 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 46,59,984 కు చేరింది. ఈమేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం హెల్త్‌ బులెటిన్‌ లో వెల్లడించింది.



అయితే..కరోనా సోకి చికిత్స పొందిన 36 లక్షల మంది కోలుకున్నారని తెలిపింది. యాక్టివ్‌ కేసుల సంఖ్య కంటే రికవరీ కేసుల సంఖ్య 3.8 రెట్లు అధికంగా ఉందని తెలిపింది. దేశవ్యాప్తంగా శనివారం ఒక్కరోజే 10,71,702 కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేశామని, మొత్తం పరీక్షల సంఖ్య 5,62,60,928 చేరిందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) తెలిపింది.