ఎర్రకోట శానిటైజ్..సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ..పంద్రాగస్టు వేడుకలు

  • Published By: madhu ,Published On : August 15, 2020 / 07:36 AM IST
ఎర్రకోట శానిటైజ్..సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ..పంద్రాగస్టు వేడుకలు

కరోనా ఎఫెక్ట్ పంద్రాగస్టు వేడుకలపై పడింది. ఎర్రకోట నుంచి జరిగే కార్యక్రమాలను తగ్గించారు. విద్యార్థులను అనుమితించలేదు. పరేడ్ నిర్వహించడం లేదు. కొద్ది మంది అతిథులను మాత్రమే అనుమతించారు.



సీటింగ్ సిస్టంలో భారీ మార్పులు చేశారు. సోషల్ డిస్టెన్స్ పాటించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో పంద్రాగస్టు వేడుకలు నిరాడంబరంగా జరిగాయి.

74వ స్వాతంత్ర వేడుకల సందర్భంగా..ఎర్రకోటను పూర్తిగా శానిటైజ్ చేశారు. ఈ వేడుకలకు పిలిచిన వారందరూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ కూర్చొన్నారు. కేంద్ర మంత్రులు, ప్రముఖుులు మాస్క్ ధరించి..దూరం దూరంగా కూర్చొన్నారు.



4 వేల మంది కోసం ఏర్పాట్లు చేశారు. పరిమిత సంఖ్యలోనే ప్రజలకు అనుమతినిచ్చారు. వీరందరూ భౌతిక దూరం పాటిస్తూ కూర్చొన్నారు.

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 2020, ఆగస్టు 15వ తేదీ శనివారం ఉదయం రాజ్ ఘాట్ వద్ద ఘనంగా ఆయన నివాళులర్పించారు. తర్వాత ఎర్రకోట వద్దకు చేరుకున్నారు. భద్రతా దళాల గౌరవ వందనం స్వీకరించారు. సైనికులు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ నిలబడ్డారు.



ఉదయం 7.30 గంటలకు మోడీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. సమీప ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎర్రకోట చుట్టూ మూడు కిలోమీటర్ల దూరం వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలు 10 గంటల వరకు కొనసాగనున్నాయి.