స్మగ్లర్ల గుట్టురట్టు: రూ.10 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం

  • Published By: bheemraj ,Published On : November 21, 2020 / 01:48 PM IST
స్మగ్లర్ల గుట్టురట్టు: రూ.10 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం

Red sandalwood seized : తమిళనాడులో భారీగా ఎర్రచందనం పట్టుపడింది. కోట్ల రూపాయల విలువ చేసే ఎర్ర చందనాన్ని.. గుట్టుచప్పుడు కాకుండా దేశం దాటించేందుకు యత్నించిన స్మగ్లర్ల ప్రయత్నాలకు పోలీసులు బ్రేక్ వేశారు. తుత్తుకూడి ఓడరేవు ద్వారా విదేశాల్లో ఎర్రచందనం అక్రమంగా రవాణా చేస్తున్నట్లు కేంద్ర రెవెన్యూ దర్యాప్తు శాఖ అధికారులు సమాచారం అందించింది.



ఈ నేపథ్యంలో.. టుటికోరియన్, పలయంకోట్టై రహదారిపై పోలీసులతో కలిసి తనిఖీలు చేపట్టారు. అధికారులను చూడగానే ఓ ట్రక్కు డ్రైవర్ పారిపోయాడు. ట్రక్కును పరిశీలించగా.. అందులో 10కోట్ల విలువ చేసే ఎ్రరచందనాన్ని గుర్తించారు.



https://10tv.in/delhi-teen-girl-shot-at-by-elder-brother-for-chatting-to-man/
తుత్తుకూడి ఓడరేవు ద్వారా ఎర్రచందనం విదేశాలకు తరలించేందుకు తీసుకెళ్తున్నట్లు అధికారులు గుర్తించారు. పట్టుబడిన ఎర్రచందనం 16టన్నులు ఉంటుందని అంచనా వేశారు.