Bharat Biotech: తగ్గిన కొవిడ్ కేసులు.. కోవాగ్జిన్ ఉత్పత్తిని తగ్గించిన భారత్ బయోటెక్

భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ కీలక ప్రకటన చేసింది. కొవిడ్-19 వ్యాక్సిన్ ఉత్పత్తిని తాత్కాలికంగా తగ్గించినట్లు పేర్కొంది. ఈ మేరకు భారత్ బయోటెక్ శుక్రవారం అర్థరాత్రి ఒక ప్రకటనలో..

Bharat Biotech: తగ్గిన కొవిడ్ కేసులు.. కోవాగ్జిన్ ఉత్పత్తిని తగ్గించిన భారత్ బయోటెక్

Bharat Biotech

Bharat Biotech: భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ కీలక ప్రకటన చేసింది. కొవిడ్-19 వ్యాక్సిన్ ఉత్పత్తిని తాత్కాలికంగా తగ్గించినట్లు పేర్కొంది. ఈ మేరకు భారత్ బయోటెక్ శుక్రవారం అర్థరాత్రి ఒక ప్రకటనలో తెలిపింది. కొవిడ్ – 19 నిర్మూలనకు భారత్ బయోటెక్ కోవాగ్జిన్ ను ఉత్పత్తి చేసింది. దేశంలోనేకాక ఇతర దేశాలకు వ్యాక్సిన్ ను అందించింది. తాజాగా దేశంలో కొవిడ్ వ్యాప్తి తగ్గుముఖం పడుతుంది. రోజుకు 1500 నుంచి 2 వేల కేసులు మాత్రమే నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కోవాగ్జిన్ డిమాండ్ తగ్గడంతో ఉత్పత్తిని తగ్గించినట్లు తెలుస్తోంది.

Bharat Biotech : భారత్ బయోటెక్‌ బూస్టర్ డోస్ ట్రయల్స్‌కు DCGI అనుమతి.. ముక్కు ద్వారా వేసే టీకా..!

అయితే టీకా సంస్థలకు ఒప్పందం మేరకు సరఫరా పూర్తిచేసినట్లు సంస్థ ప్రకటనలో పేర్కొంది. గత ఏడాది కాలంగా కోవాగ్జిన్ టీకాను పెద్దమొత్తంలో ఉత్పత్తి చేయడం కోసం తమ తయారీ కేంద్రాలన్నీ నిరంతరం పనిచేశాయని పేర్కొన్న సంస్థ.. భారత్ దేశంతో పాటు ప్రపంచ అవసరాల కోసం కోట్లకొద్దీ డోసుల టీకా తయారు చేసినట్లు వివరించింది. కోవాగ్జిన్ టీకా నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడలేదని భారత్ బయోటెక్ ప్రకటనలో స్పష్టం చేసింది. టీకా తయారీ కేంద్రాల అధునాతన ప్రక్రియ చేపట్టాల్సిన ఉందని, తయారీ కేంద్రాల్లో నిర్వహణ పనులు చేపట్టాల్సి ఉందని, సదుపాయాలను మరింత సమర్థవంతంగా వినియోగించే ప్రక్రియపై దృష్టి సారించినట్లు భారత్ బయోటెక్ సంస్థ పేర్కొంది.

Bharat Biotech : భారత్ బయోటెక్ కీలక ప్రకటన..వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయొద్దు!

ఇదిలా ఉంటే గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 1,260 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో శనివారం నాటికి కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 4,30,27,035కి చేరుకుంది. 28 కొవిడ్ సంబంధిత మరణాలు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు కొవిడ్ తో మరణించిన వారి సంఖ్య 5,21,129కి చేరుకుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం యాక్టివ్ కేసులు 14,704కి తగ్గాయి. రికవరీ రేటు ప్రస్తుతం 98.75 శాతంగా ఉందని, రోజువారీ సానుకూలత రేటు 0.22 శాతంగా ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది.